యాప్నగరం

తండ్రిగా గర్వంగా.. కొడుకుగా ఈర్ష్యగా..: నాగ్

ఇవాళ ఓ తండ్రిగా నాకెంతో గర్వంగా ఉంది. కానీ కొడుకుగా ఈర్ష్యగా ఉందని అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు.

Samayam Telugu 10 May 2018, 6:13 pm
సావిత్రి బయోపిక్ ‘మహానటి’కి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనబర్చిన అద్భుత నటన, డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విధానం, నిర్మాతల అభిరుచి ఇవన్నీ కలిపి సినిమాను క్లాసికల్ హిట్‌గా నిలిపాయి. సావిత్రి గురించి తెలియని వారికి మహానటి జీవితం ఎలా సాగిందో ఈ బయోపిక్ ద్వారా తెలుసుకునే అవకాశం దక్కింది.
Samayam Telugu nag family


ఈ సినిమాలో అలనాటి దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకుల పాత్రల్లో నేటి తరం హేమాహేమీలు చక్కగా ఒదిగిపోయారు. సావిత్రి పెదనాన్న కేవీ చౌదరి పాత్రలో రాజేంద్రప్రసాద్, ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు జీవించారు. ఏఎన్నార్‌గా ఆయన మనవడు అక్కినేని నాగచైతన్య ఆకట్టుకున్నాడు.

తన తండ్రి పాత్రలో చైతూ నటించడంపై నాగార్జున స్పందించాడు. ఓ తండ్రిగా గర్వంగా ఉంది, కొడుకుగా జలసీగా ఉంది. నా తండ్రి లెజెండరీ ఏఎన్నాఆర్ పాత్రలో నేనెప్పుడూ నటించలేదు. చైతూను ఏఎన్నాఆర్ పాత్రలో చూడటం ఎంతో ఆనందంగా ఉందంటూ నాగేశ్వరరావు నటించి పాత్రలు.. మహనటిలో ఏఎన్నాఆర్‌గా చైతూ ఉన్న వీడియోను నాగ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. వయసు దాటిపోవడం వల్లే తన తండ్రి పాత్రలో నటించలేదని నాగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.