యాప్నగరం

చచ్చిపోవాలనుకున్నా..: ఇలియానా

ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 5) జరిగిన 21వ ‘వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో గోవా బ్యూటీ ‘ఉమెన్‌ ఆఫ్‌ సబ్‌స్టెన్స్‌’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివరించింది.

TNN 6 Nov 2017, 1:40 pm
గోవా బ్యూటీ ఇలియానా.. ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. ఎందుకో.. ఏమిటో ఆమె మాటల్లోనే చూడండి.. ‘ఒకానొక సమయంలో నేను నా బాడీ షేప్ గురించి చాలా బాధపడేదాన్ని. నా శరీరాకృతిపై చాలా మంది కామెంట్లు చేసేవారు. అది నాకు మరింత బాధ కలిగించింది. దాంతో చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎవరో చెప్పేంతవరకు నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నానన్న విషయం తెలుసుకోలేదు. ఒక దశలో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. అలాంటి సమయంలో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. క్రమంగా నన్ను నేను మార్చుకున్నాను. మన మెదడులో ఏదైనా బాధ కలిగితే.. వెంటనే చికిత్స తీసుకోవాలి. దానంతట అదే తగ్గిపోతుందిలే అనుకొని నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత బాధపడాల్సి వస్తుంది. మనకు ఏదైనా దెబ్బ తగిలినా, నొప్పిగా ఉన్నా డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుతాం కదా..! అదేవిధంగా డిప్రెషన్‌గా అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని ఇలియానా అంది.
Samayam Telugu i had suicidal thoughts says ileana on her body dysmorphic disorder
చచ్చిపోవాలనుకున్నా..: ఇలియానా


డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే మొదటగా చేయాల్సిన పని మనకు మనం ధైర్యం చెప్పుకోవడమే అని ఇలియానా సూచించింది. ‘హీరో, హీరోయిన్లను చూడగానే చాలా మంది.. వాళ్లు ఎంత చక్కగా, ఆరోగ్యంగా ఉన్నారో అనుకుంటారు. కానీ, మేం ఇంత అందంగా కనిపించడానికి తెర వెనక గంటల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మాత్రం.. ఎలాంటి మేకప్‌లు అవసరం లేకున్నా అందంగా కనిపించవచ్చు’ అని ఇలియానా చెప్పుకొచ్చింది.

ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 5) జరిగిన 21వ ‘వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో గోవా బ్యూటీ ‘ఉమెన్‌ ఆఫ్‌ సబ్‌స్టెన్స్‌’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివరించింది. మొత్తం మీద డిప్రెషన్ బారిన పడ్డవారి జాబితాలో దీపికా పదుకొణె, కరణ్ జోహర్ లాంటి నటుల తర్వాత ఇప్పుడు ఈ అమ్మడు కూడా చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.