యాప్నగరం

పెళ్లిపై స్పందించిన ప్రియాంక చోప్రా..!

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకి తన పెళ్లి వార్తలపై స్పందించింది. ముంబయి వీధుల్లో తన బాయ్‌ఫ్రెండ్‌ నిక్ జాన్స్‌తో కలిసి గత

Samayam Telugu 15 Jul 2018, 9:23 am
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకి తన పెళ్లి వార్తలపై స్పందించింది. ముంబయి వీధుల్లో తన బాయ్‌ఫ్రెండ్‌ నిక్ జాన్స్‌తో కలిసి గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూ మీడియా కంటపడిన ప్రియాంక చోప్రా.. పెళ్లి గురించి అడిగే ప్రశ్నలకి మాత్రం సమాధానం దాటవేస్తూ వచ్చింది. కానీ.. తాజాగా తనకి వివాహ వ్యవస్థపై అపారమైన నమ్మకముందని.. కచ్చితంగా ఏదో ఒక దశలో పెళ్లి చేసుకుంటానని చాకచక్యంగా చెప్పుకొచ్చింది.
Samayam Telugu 704257-priyankachopra-nickjonas-071418


బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ మంచి క్రేజ్‌ సంపాదించుకున్న 35 ఏళ్ల ప్రియాంక చోప్రా.. తన కంటే.. 10 ఏళ్ల చిన్నవాడైన నిక్ జాన్స్‌తో కలిసి కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరూ ముకేశ్ అంబానీ కొడుకు నిశ్చితార్థానికి కూడా కలిసి వెళ్లారు.

‘జీవితంలో ఏదో ఒక దశలో వైవాహిక దశలోకి అడుగుపెట్టాలని నాకు తెలుసు. ఇంకా చెప్పాంటే.. పెళ్లి చేసుకోవడం అనే ఆలోచన నాకు చాలా ఇష్టం. వివాహ వ్యవస్థపై అపారమైన నమ్మకం కూడా ఉంది. కానీ.. ఆ పెళ్లి దశ నా జీవితంలో ఎప్పుడు వస్తుందో..? మాత్రం చెప్పలేను’ అని తెలివిగా సమాధానమిచ్చింది ఈ చిన్నది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.