యాప్నగరం

లావణ్య త్రిపాఠికి మీరేమైనా సాయం చేయగలరా..?

కొన్ని ఫొటోలకు భావాలు చెప్పడం కష్టం..కానీ ప్రయత్నించొచ్చు

TNN 20 Feb 2017, 2:41 pm
సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ ’ సినిమాలో పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్న లావణ్య.. నాగ చైతన్యతో కూడా ఓ సినిమాకు ఇటీవల సంతకం చేసింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా లావణ్య త్రిపాఠి ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలోని ఎక్స్‌ప్రెషన్‌ని తనే గుర్తించలేకున్నానని చెప్పుకొచ్చింది. అభిమానులు మాత్రం లవ్, బాధ, కోపం, అలక అంటూ లావణ్య ఎక్స్‌ప్రెషన్‌ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Samayam Telugu i really cant decode this expression
లావణ్య త్రిపాఠికి మీరేమైనా సాయం చేయగలరా..?


అందాల రాక్షసి సినిమాతో యువతను ఆకర్షించిన లావణ్య త్రిపాఠి.. నానితో చేసిన భలే భలే మగాడివోయ్‌తో బ్లాక్ బాస్టర్‌ని అందుకుంది. గత ఏడాది సంక్రాతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున పక్కన నటించిన ఈ చిన్నది ఇప్పుడు నాగ చైతన్య పక్కన చేసేందుకు రెడీ అయిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.