యాప్నగరం

ట్రంప్‌ను ఓడించేదాన్ని: బాలీవుడ్ భామ

నిత్యం మీడియాలో తన పేరు మారుమోగిపోవాలని బాలీవుడ్ ఐటమ్ గార్ల్ రాఖీ సావంత్‌కి యమ సరదా.

Samayam Telugu 27 Nov 2016, 3:59 pm
నిత్యం మీడియాలో తన పేరు మారుమోగిపోవాలని బాలీవుడ్ ఐటమ్ గార్ల్ రాఖీ సావంత్‌కి యమ సరదా. అందుకే తరచు ఏదో ఒక వివాదాస్పద కామెంటో..లేక ఫన్నీ స్టేట్ మెంటో ఇస్తూ ఉంటుంది.
Samayam Telugu i should have contested against trump i could win easily says rakhi sawant
ట్రంప్‌ను ఓడించేదాన్ని: బాలీవుడ్ భామ


తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసి ఉంటే డొనాల్డ్ ట్రంప్‌ను ఈజీగా ఓడించేదాన్ని అంటోంది. అంతేకాదు డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ట్రంప్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోయారని విమర్శలు గుప్పిస్తోంది.

‘ట్రంప్ పై నేనే పోటీ చేసి ఉండాల్సింది. హిల్లరీ అతణ్ని షేక్ చేయలేకపోయింది. నేనైతే ఈజీగా గెలిచేదాన్ని’ అని ఆమె చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ 10 షో లో పాల్గొన్న ఓమ్ స్వామిపై తనదైన శైలిలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో తాను పాల్గొని ఉంటే ఆ స్వామి నిద్రిస్తున్న సమయంలో గెడ్డం కత్తిరించి...ఆయన బట్టల్ని దాచిపెట్టి.. ఎక్కడో పడేసేదాన్ని...అతను ఏదైనా గుహలో నుంచి వచ్చాడా? ఎవరాయనా? అంటూ వ్యాఖ్యానించింది.

అటు బాలీవుడ్ సెక్సీ స్టార్ సన్నీ లియోనీని కూడా రాఖీ వదల్లేదు. విదేశాల్లో సన్నీ నగ్నంగా ఉంటే...ఇండియన్లు మాత్రం ఫుడ్, చీరలు, డబ్బులు కట్టబెట్టారని విమర్శలు చేసింది. అంతటితో ఆగకుండా తాను కొత్తగా చేయబోయే టీవీ షో-రాఖీ ఇన్ ఖాకీ..లో తన వద్ద అసిస్టెంట్లు పనిచేస్తున్న ఇద్దరికి సన్నీ, లియోనీ అని పేర్లు పెట్టినట్లు చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.