యాప్నగరం

అందులో వేలు పెట్టను -నిఖిల్

వైవిద్యమైన కథాంశాలను ఎన్నుకుంటూ యువతరం హీరోల్లో తనకంటూ ప్రత్యేక పేరును తెచ్చుకున్న హీరో నిఖిల్.

Samayam Telugu 17 Nov 2016, 1:55 am
వైవిద్యమైన కథాంశాలను ఎన్నుకుంటూ యువతరం హీరోల్లో తనకంటూ ప్రత్యేక పేరును తెచ్చుకున్న హీరో నిఖిల్. అయితే నిఖిల్‌పై చాలా రోజులుగా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అతడు డైరెక్షన్ విషయంలో జోక్యం చేసుకుంటాడని.. దర్శకుడిని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాడని ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా ఈ హీరో నటించిన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Samayam Telugu i wont involve in directors job nikhil
అందులో వేలు పెట్టను -నిఖిల్


ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిఖిల్ తనపై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చాడు. దర్శకుడికి ఫ్రీడం ఇస్తేనే సినిమా హిట్ అవుతుందని భావించే వాడిని నేను.. అటువంటిది నేను క్రియేటివిటీ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను. కావాలంటే నాతో పని చేసిన దర్శకులెవరినైనా.. అడగండి.. అయితే సినిమా పూర్తయిన తర్వాత పబ్లిసిటీ విషయంలో మాత్రం కేర్ తీసుకుంటాను. పబ్లిసిటీ ఎలా చేసుకుంటే సినిమాకు బెటరో నాకు తెలిసినంత వరకు సలహాలు ఇస్తాను. ఆ విధంగా చేయడం నాకు బాగా కలిసొస్తుంది కూడా.. అంటూ సమాధానం చెప్పాడు నిఖిల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.