యాప్నగరం

నేనూ లైంగిక వేధింపుల బాధితురాలినే!

తాము కూడా లైంగిక వేధింపులకు మినహాయింపు కాదని నలుగురి ముందూ ఆ విషయాలను బయట పెడుతోన్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా చేరిపోయారు.

TNN 30 Oct 2017, 5:06 pm
తాము కూడా లైంగిక వేధింపులకు మినహాయింపు కాదని నలుగురి ముందూ ఆ విషయాలను బయట పెడుతోన్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా చేరిపోయారు. వేధింపులపై ప్రపంచవ్యాప్తంగా 'మీటూ' హ్యాష్‌టాగ్‌తో ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, అనుపమ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. ప్రతి అమ్మాయీ జీవితంలో వేధింపులు ఎదుర్కొంటుందని, తనకు తెలియకుండానే కొన్నిసార్లు ఇవి జరిగిపోతుంటాయని అనుపమ పరమేశ్వరన్ వ్యాఖ్యానించారు. దీనికి ఉదాహరణలు వివరిస్తూ, బస్సులో కండక్టర్ తాకుతూ వెళ్లవచ్చని, తన జీవితంలోనూ పలుమార్లు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.
Samayam Telugu iam also facing sexual harassment anupama parameshwaran
నేనూ లైంగిక వేధింపుల బాధితురాలినే!


మాటలతో వేధించేవాళ్లు కొందరైతే, చూపులతో నమిలేసేవారు ఇంకొందరు, అవసరం లేకున్నా దగ్గరకు వచ్చి తాకడానికి చూసేవాళ్లు ఇలా ఎంతో మంది తనకు ఎదురయ్యారని, దూరం జరగాలని వారిని చాలాస్లారు హెచ్చరించినట్లు అనుపమ వెల్లడించారు. ఆ సమయంలో పురుషులకు కలిగే ఆనందం ఏంటో తనకు తెలియడం లేదని ఆమె అన్నారు. వారు చేసే పనులు ఎంతో చిరాకును తెప్పించేవని, ఎంతో మంది మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న సంగతి తనకు తెలుసునని అనుపమ వివరించారు. ఇక పురుషుల చూపులు తమను ఎంత బాధపెడతాయో అర్థం చేసుకోవాలని, వారికి కూడా ఓ తల్లి, ఓ సోదరి ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.

హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టెయిన్ లైంగిక వేధింపుల విషయం ఓ నటి బయటపెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు దీనిపై స్పందించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుట్ నటి అలిస్సా మిలానో ట్విట్టర్ ద్వారా ’మీటూ’ హ్యష్‌ట్యాగ్‌తో ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసింది. హార్వీ బాధితుల్లో అలిస్సా మిలానో, ఏంజెలినా జోలీ లాంటి హాలీవుడ్ నటీమణులు కూడా ఉన్నారు. అమెరికాలో ప్రారంభమైన ఈ పోరాటం సోషల్ మీడియా ద్వారా ప్రపంచ మొత్తానికి పాకింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.