యాప్నగరం

స్టార్ హీరోయిన్‌తో అభిమాని అనుచిత ప్రవర్తన!

సినీతారలతో అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. పబ్లిక్ ప్లేసుల్లో హీరోయిన్లు అగుపించినప్పుడు

TNN 21 Aug 2017, 8:02 am
సినీతారలతో అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. పబ్లిక్ ప్లేసుల్లో హీరోయిన్లు అగుపించినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు. సినీతారలను చూసి ఆనందం పొందే వాళ్లు కొందరైతే, వారిని తాకి శునకానందం పొందాలని చూసే వాళ్లు మరికొంతమంది. అలాంటి వారితో హీరోయిన్లు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇలియానాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైందట. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది ఈమె.
Samayam Telugu ileana slams fan for misbehaviour
స్టార్ హీరోయిన్‌తో అభిమాని అనుచిత ప్రవర్తన!


తను నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘బాద్షాహో’ ప్రచార కార్యక్రమంలో ఇలియానాకు చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తోంది. ఎవరో ఆమెతో అనుచితంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేసింది.

‘It's a pretty shitty world we live in. I'm a public figure. I understand that I don't have the luxury of a private & an anonymous life. But that doesn't give any man the right to misbehave with me. Don't confuse "fan antics" with that. I am a WOMAN at the end of the day.’ అంటూ రెండు ట్వీట్ల ద్వారా తన ఆవేదనను పంచుకుంది ఇలియానా.

‘మనం అత్యంత దారుణమైన ప్రపంచం మధ్యన ఉన్నాం. నేను పబ్లిక్ ఫిగర్ నే. నాకు వ్యక్తిగత, ప్రైవేట్ జీవితం ఉండదని తెలుసు. అలాగని నాతో అనుచితంగా ప్రవర్తించడానికి నేనెవరికి హక్కు ఇవ్వలేదు. ఫ్యాన్స్ కు కూడా హద్దులుంటాయి. నేను మహిళను అనే విషయాన్ని గుర్తుంచుకోండి..’ అనే సారాంశంతో ఇలియానా ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.