యాప్నగరం

Padma Awards 2019: ప్రభుదేవా స్టెప్ వేస్తే.. ‘పద్మశ్రీ’ పురస్కారం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. దీనిలో భాగంగా నాట్యానికి కొత్త న‌డ‌క‌లు నేర్పిన నాట్యాచారుడు ప్రభుదేవాకు కేంద్ర ప్ర‌భుత్వ విశిష్ట పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ ల‌భించింది.

Samayam Telugu 26 Jan 2019, 12:55 pm
చికుబుకు చికుబుకు రైలే.. అదిరినదీ నీ స్టైలే.. అంటూ డాన్స్ అనే పదానికి సరికొత్త అర్ధం చెప్పిన ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్‌ ప్రభుదేవాకు ‘పద్మశ్రీ’ అవార్డ్ వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. దీనిలో భాగంగా నాట్యానికి కొత్త న‌డ‌క‌లు నేర్పిన నాట్యాచారుడు ప్రభుదేవాకు కేంద్ర ప్ర‌భుత్వ విశిష్ట పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ ల‌భించింది.
Samayam Telugu Padma Shri Prabhudeva



డాన్స్ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన ప్రభుదేవా.. ఒక్క డాన్స్‌లోనే కాకుండా కొరియోగ్రాఫర్‌గా.. నటుడిగా.. దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ఆయన తండ్రి సుందరం మాస్టర్ కూడా పలు చిత్రాలకు నృత్యదర్శకులుగా పనిచేశారు. ప్రభుదేవా సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌లు కూడా నృత్యదర్శకులు కావడం మరో విశేషం.

ప్రభుదేవతో కలిపి మొత్తం 94 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. వీరిలో తెలుగు రాష్ట్రాలనుండి నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయవేత్త యడ్లపల్లి వెంకటేశ్వర రావు, ఫుట్‌బాల్ జాతీయ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.