యాప్నగరం

Naresh Properties: పవిత్రా లోకేష్‌తో వ్యవహారం.. నరేష్ ఆస్తులపై జోరుగా చర్చ

నటి పవిత్రా లోకేష్‌తో వ్యవహారం తరువాత సీనియర్ నటుడు నరేష్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆమెను ఆయన నాలుగో పెళ్లి చేసుకుబోతున్నాడనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నరేష్ ఆస్తులపై నెట్టింట చర్చ నడుస్తోంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 8 Jul 2022, 12:09 pm
సీనియర్ నటుడు నరేష్ (VK Naresh), నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) గురించి నెట్టింట ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. పవిత్రను నరేష్ త్వరలో నాలుగో పెళ్లి చేసుకుబోతున్నాడనే వార్తల నేపథ్యంలో ఆయన మూడో భార్య రమ్యా రఘుపతి (Ramya Raghupathi) ఒక్కసారిగా తెరపైకి వచ్చారు.
Samayam Telugu పవిత్రా లోకేష్, నరేష్


తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని ఆమె ఆరోపణలు గుప్పించడం.. డబ్బు కోసమే రమ్య ఇలా చేస్తోందని నరేష్ ఖండించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నరేష్-పవిత్ర లోకేష్‌ను మైసూర్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్లు తెలుసుకున్న రమ్య.. అక్కడికి వెళ్లి వారిని అడ్డుకుంది. పవిత్రపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించింది.

పవిత్రా లోకేష్‌తో వ్యవహారం తరువాత నరేష్ ఆస్తుల చిట్టాపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దివంగత నటి విజయ నిర్మల తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఒక్కప్పుడు క్రేజీ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఆయనకు మూడు నాలుగు ఫామ్ హౌస్‌లు ఉన్నాయని.. గచ్చిబౌలిలో 5 ఎకరాల ఫాంహౌస్ ఉందంటున్నారు. మొయినాబాద్, శంకర్‌పల్లిలో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

నరేష్‌కు ఎక్కువ భాగం ఆస్తి తల్లి విజయ నిర్మల నుంచే వారసత్వంగా వచ్చిందని సినీ పెద్దలు చెబుతారు. ఆమె నటిగానే కాకుండా.. దర్శకురాలిగా.. ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఆమె ఆస్తులు కొన్నారు. వాటి విలువ రూ.300 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజయ నిర్మలకు ఆభణాలు చాలానే ఉన్నాయని.. వాటి విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు.

1990 లో హీరోగా నరేష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పుడు ఆయన బాగానే సంపాదించారని టాక్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన క్యారెక్టర్‌ను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తీసుకుంటారని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అంతేకాకుండా నరేష్‌కు నాలుగు ఖరీదైన కార్లు ఉన్నాయని.. ఇటీవలె ఓ స్పోర్ట్స్ కారు కూడా కొనుగోలు చేశారని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.