యాప్నగరం

ఈమెలో ఎన్నెన్ని వింతలో.. చూడాలంటే!!

ఇంతలో ఎన్నెన్ని వింతలో .. అంటూ చాాలా వింతలు చూపించడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

TNN 29 Apr 2017, 6:57 pm
టాలెంటెడ్ హీరో నందు నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇంతలో ఎన్నెని వింతలో విడుదలకి ముస్తాబవుతోంది. హరి హర చలన చిత్ర పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాతో వి.వి.వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.
Samayam Telugu inthalo ennenni vinthalo release date confirmed
ఈమెలో ఎన్నెన్ని వింతలో.. చూడాలంటే!!


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహంతో చిత్రాన్ని కూడా మే 26న విడుదల చేసి సక్సెస్ అందుకుంటామని దర్శకనిర్మాతలు అంటున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో రాని ఓ ఢిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందినట్లుగా చిత్ర బృందం తెలిపింది.

నూతన దర్శకుడు అయినప్పటికి వరప్రసాద్ ఈ సినిమాని ప్రేక్షకుల్ని అలరించే రీతన తీర్చిదిద్దనట్లు యూనిట్ సభ్యలు చెబుతున్నారు. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరో నందుతో పాటు స్వామిరారా ఫేమ్ పూజారామచంద్రన్ కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనతం త్వరగా వాటిని ముగించి ఈ మండు వేసవిలోప్రేక్షకుల్ని హాయిగా అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా దర్శకుడు వరప్రసాద్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.