యాప్నగరం

బాలయ్య... వయసుకు తగ్గ పాత్రలో..?

ఇండియన్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.

Samayam Telugu 2 Apr 2018, 1:24 pm
ఇండియన్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. 50,60 యేళ్ల వయసుకు దగ్గరపడినా మనోళ్లు ఇంకా తెరపై కుర్రాళ్లుగానే కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు ఉన్న మాస్ ఇమేజ్ నేపథ్యంలో హీరోలు అలాంటి పాత్రల్లోనే నటిస్తూ ఉంటారు. అయితే రోజులు మారాయి.. హీరోల ఆలోచన సరళి కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో తమ వయసుకు తగ్గ పాత్రలతో కూడిన మంచి కథలు వస్తే.. హీరోలు కూడా కాదనే పరిస్థితి లేదు. ఇప్పుడు బాలయ్య విషయంలో అదే జరుగుతోందట.
Samayam Telugu balak6


వినాయక్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో ఈ హీరో తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం బాలయ్య వయసు 57 సంవత్సరాలు. దాదాపు ఇదే వయసుతో ఉండే పాత్రలోనే బాలయ్య కనిపించబోతున్నాడట వినాయక్ సినిమాలో. ఇది గాడ్ ఫాదర్ తరహా పాత్ర అని తెలుస్తోంది.

అయితే బాలయ్యకు ఇలాంటి పాత్రలో కొత్తేమీ కాదు. వెనుకటికి ‘చెన్నకేశవరెడ్డి’లో కూడా బాలయ్య జుట్టు లైట్ గా నెరిసిన పాత్రను చేశాడు. అయితే అందులో.. కుర్రాడి పాత్రలో కూడా కనిపించాడు ఈ హీరో. ఆ తర్వాత ‘ఒక్కమగాడు’లో ఓల్డ్ మ్యాన్ పాత్రలో కనిపించాడు. కానీ కుర్రాడి పాత్రలో కూడా మెరిశాడు. కానీ ఈ సారి అలా కాదట. ఇందులో బాలయ్య కేవలం ఒక రోల్ లో నే కనిపిస్తాడని, అది గాడ్‌ఫాదర్ తరహా రోల్ లో మాత్రమే అని టాక్.

ప్రస్తుతం బాలయ్య తండ్రి బయోపిక్‌తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే.. వినాయక్ తో సినిమాను ప్రారంభించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.