యాప్నగరం

Rajasekhar: అన్నయ్య ఆర్డర్‌తో రాజశేఖర్‌పై సస్పెన్షన్ వేటు!

MAA Diary Launch: ‘మా’ పెద్దలు హీరో రాజశేఖర్‌పై చర్యలు తీసుకోబోతున్నారా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైలీ ఆవిష్కరణలో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహారశైలిపై మా పెద్దలు చిరంజీవి, మోహన్ బాబులు సీరియస్‌ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 2 Jan 2020, 3:28 pm
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. ఎక్కడకు వెళ్లినా సౌమ్యంగా వ్యవహరించే మెగాస్టార్ చిరంజీవి.. స్టేజ్‌పైనే రాజశేఖర్ వ్యవహారశైలిని ఖండించారు. ఆయనపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
Samayam Telugu Chiranjeevi Vs Rajashekar
మా డైరీ ఆవిష్కరణ‌లో చిరు, మోహన్ బాబు


అయితే హీరో రాజశేఖర్ తీరుపై విమర్శలు తలెత్తుతున్నాయి. ‘మా’ వ్యవస్థాపకు అధ్యక్షడు చిరంజీవి మాట్లాడుతుంటే.. పదే పదే అడ్డుపడటం, మైక్ లాక్కోవడమే కాకుండా ఇండస్ట్రీ పెద్దలతో గౌరవం లేకుండా అమర్యాదగా మాట్లాడిన రాజశేఖర్‌పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.

Read Also:వినండి చిరు, మోహన్ బాబు గారూ.. అరిస్తే ఏం కాదిక్కడ: రాజశేఖర్ రచ్చ రచ్చ

ఈ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చిన రాజశేఖర్‌పై ‘మా’ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చిరంజీవి. మా ఫౌండర్‌గా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఈ ఇష్యూపై చాలా సీరియస్‌గా ఉండటంతో రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మా అధ్యక్షుడు నరేష్ స్పాట్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. మా గురించి మీడియా ముందు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్పాట్ కమిటీకి తెలియజేయవచ్చునన్నారు నరేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.