యాప్నగరం

అనుపమా పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక డేటింగ్!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆమె ఎక్కడా ప్రకటించలేదు. కానీ, ఐఎండీబీలో అప్‌డేట్ అయ్యింది.

Samayam Telugu 27 Nov 2020, 8:19 pm
కన్నడ బ్యూటీ రష్మిక మందనకు ప్రస్తుతం సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచి మరింత పాపులారిటీని సంపాదించింది. అయితే, రష్మిక గురించి ప్రస్తుతం ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అది ఆమె రిలేషన్‌షిప్ గురించి. మలయాళ దర్శకుడు, నిర్మాత చిరంజీవ్ మక్వానాతో రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ ఫిలింస్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ స్పష్టం చేస్తోంది.
Samayam Telugu చిరంజీవ్ మక్వానా, అనుపమ, రష్మిక
Rashmika Mandanna and Anupama Parameswarn


ఐఎండీబీలో రష్మిక మందన బయోగ్రఫీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి అనుమపమా పరమేశ్వరన్ ప్రియుడు చిరంజీవ్ మక్వానా అని ప్రచారంలో ఉంది. అందుకనే, అనుపమా పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఐఎండీబీలో అప్‌డేట్ చేశారు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే రష్మికనో లేదంటే చిరంజీవ్ మక్వానానో స్పందించే వరకు ఆగాల్సిందే.

ఐఎండీబీలో రష్మిక గురించి వివరాలు

నిజానికి కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన.. ‘‘కిర్క్ పార్టీ’’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్ర హీరో, దర్శకుడు రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడ్డారు. ఆయనతో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ తరవాత వ్యక్తిగత కారణాలతో రక్షిత్ శెట్టితో పెళ్లిని రద్దు చేసుకున్నారు రష్మిక. టాలీవుడ్‌లో రష్మిక బాగా రాణిస్తుండటంతో ఆ జర్నీని కొనసాగించాలనే ఉద్దేశంతోనే రక్షిత్ శెట్టి నుంచి రష్మిక విడిపోయారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

Also Read: మేం పంది మాంసం తింటాం.. ఇంట్లోనే వైన్ తయారుచేస్తాం: రష్మిక చెప్పిన రహస్యాలు

ఆ తరవాత విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాలో నటించిన రష్మిక మందన ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉందనే ప్రచారం జరిగింది. ఈ వదంతులను అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఖండించారు. అయితే, ఇప్పుడు అనుపమా పరమేశ్వర్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన డేటింగ్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.