యాప్నగరం

నిజంగానే నా గుండె పగిలింది: రష్మిక

ఫొటోషూట్ చేయడానికి వెళ్లిన నటి రష్మిక మందన అక్కడ పరిస్థితిని చూసి ఒక్కసారిగా చలించిపోయారు. వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Samayam Telugu 14 Dec 2018, 7:48 pm
రోజురోజుకూ కాలుష్యం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. కాలుష్యం కారణంగా మనుషులతో పాటు జంతుజాలం కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కుంటోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు స్టార్ హీరోయిన్, గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన తనవంతుగా బాధ్యత తీసుకున్నారు. కాలుష్యాన్ని నివారించాలని, అందుకు అనుగుణంగా మనం నడుచుకోవాలని చాటి చెప్పేందుకు ఓ చిన్న ఫొటోషూట్ చేశారు. ఆ వివరాలు తన ఫాలోయర్లతో ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు
Samayam Telugu Rashmika1


కర్ణాటకలోని అతి పెద్ద చెరువైన బెళ్లందూర్‌లో నీటిలో దిగిన ఆమె ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫొటో గమనిస్తే హీరోయిన్ చుట్టూ ప్లాస్టిక్‌ కవర్లు ఉన్నాయి. దీనిపై నటి ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన చిత్ర బృందంతో కలిసి నీటి కాలుష్యంపై అవగాహన కల్పించడానికి ఫొటోషూట్‌ చేశా. బెళ్లందూర్‌ చెరువు దగ్గరికి వెళ్లి షూట్‌ చేసేంత వరకు కాలుష్యం సమస్యలు నాకు తెలియవు.


గతంలో ఈ చెరువు నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉండేవో గుర్తుకురాగా నిజంగా నా గుండె పగిలింది. ఇలాంటి కాలుష్యంలో ఉండాలని నేను కోరుకోను’ అని రష్మిక తన ట్వీట్లలో వివరించారు. సన్మతి డి. ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. ఈ ఫొటోషూట్‌ అనంతరం రష్మిక కాలుష్యంపై అవగాహన పెంచాలని ఫొటోలు షేర్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.