కండోమ్ యాడ్‌పై అభ్యంతరం తెలిపిన విమర్శకులకు సన్నీ లియోన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ బాలీవుడ్ బ్యూటీతో నవరాత్రులను లింక్ పెట్టి ఇటీవల కండోమ్‌లపై చేసిన యాడ్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు గుజరాత్లో దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ ఫ్లెక్సీల ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. 'కమ్ ప్లే నవ్ రాత్రి.. బట్ విత్ లవ్' అంటూ వెలసిన ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని సూరత్‌కు చెందిన ‘హిందూ యువ వాహిని’ ఆందోళనకు దిగింది. పండగ సమయంలో ఈ సెక్స్ ప్రచారం ఏంటనీ, ఆ హోర్డింగ్‌లను తొలగించకుంటే నిరసనలు తీవ్రం చేస్తామని ఆ సంస్థ నేత నరేంద్ర చౌదరి హెచ్చరించారు. దీనిపై సన్నీ తీవ్రంగా విరుచుకుపడింది.
‘నాన్సెన్స్.. ఇది కూడా ఓ వివాదమేనా? అసలు అందులో వల్గారిటీ ఏముంది? అది కూడా అన్నింటిలానే ఒక మూములు ప్రకటన. కాకపోతే కాస్త విభిన్నంగా రూపొందించారు.. అంతే. సెక్స్ అనేది మనిషి జీవితంలో సగ భాగం. అది ఆరోగ్యంగా.. రక్షణాత్మకంగా ఉండాలనే ఆ ప్రకటన ద్వారా చెప్పాం. ఏదో కండోమ్ వాడటం మహా పాపమైనట్టు.. దాన్ని వివాదం చేస్తే ఎలా?’ అంటూ సన్నీ తనదైన శైలిలో బదులిచ్చింది.
ఇంతకుముందు కేరళలోనూ సన్నీకి సంబంధించిన ఇలాంటిదే మరో యాడ్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. అక్కడి మహిళలు ఆ కండోమ్ యాడ్ ఫ్లెక్సీలను చింపేసి, సన్నీ ఫోటోలను తగులబెట్టి నిరసనలు చేశారు.