యాప్నగరం

‘జబర్దస్త్’ ట్రైలర్: చీరకట్టే ఛమ్మక్ చంద్ర.. కత్తి పట్టాడు!

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఛమ్మక్ చంద్ర తనదైన కామెడీ పంచ్‌లతో ఆ ప్రోగ్రామ్‌లో హైలైట్‌గా నిలుస్తున్నారు.

TNN 30 Dec 2017, 3:10 pm
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఛమ్మక్ చంద్ర తనదైన కామెడీ పంచ్‌లతో ఆ ప్రోగ్రామ్‌లో హైలైట్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా మహిళా వేషంలో చీరకట్టి చంద్ర చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆయన చేసిన స్కిట్స్‌లో చాలా వరకూ ఈ చీరకట్టుతోటే బాగా పాపులర్ అయ్యారు. దీంతో అటు బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న చంద్ర ఈమధ్య కాలంలో వెండి తెరపై చిన్నచితక పాత్రలను చేస్తున్నారు. అయితే తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో లభించక పోవడంతో కోలీవుడ్‌ వైపు అడగులు వేశాడు ఛమ్మక్ చంద్ర.
Samayam Telugu jabardasth chammak chandra playing villain role in seyal tamil movie
‘జబర్దస్త్’ ట్రైలర్: చీరకట్టే ఛమ్మక్ చంద్ర.. కత్తి పట్టాడు!


రవి అబ్బులు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సెయల్’ అనే తమిళ చిత్రంలో ఛమ్మక్ చంద్ర విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకూ కమెడియన్‌గా పరిచితమైన చంద్ర విలన్‌గా ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ చిత్రంలో చంద్ర క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్. సీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌లో సీఆర్ రాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సెయల్’ మూవీ ట్రైలర్‌లో ఛమ్మక్ చంద్రను చూడొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.