యాప్నగరం

కిరాక్ ఆర్పీ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు.. ప్రేమించిన అమ్మాయితో త్వరలో పెళ్లి

Jabardasth, అదిరింది షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన కిరాక్ ఆర్పీ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. సన్నిహితులు, స్నేహితులు, జబర్దస్త్ నటులు ఈ కార్యక్రమానికి హాజరై.. నూతన జంటను ఆశీర్వదించారు. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీతో త్వరలో ఆర్పీ పెళ్లి జరుగనుంది. లక్ష్మీ నెల్లూరులో ఈవెంట్ బిజినెస్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు మెగా బ్రదర్ నాగబాబు, నిహారిక‌తో పాటు పలువురు జబర్దస్త్ షో నటులు హాజరయ్యారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 27 May 2022, 12:36 pm
జబర్దస్త్ కామెడీ షోతో టైమింగ్ ఉన్న కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం జరిగింది. ప్రేమించిన అమ్మాయితో ఆర్పీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఎంగేజ్‌మెంట్ వేడుకకు జబర్దస్త్ టీం సభ్యులతో పాటు నాగబాబు హాజరై కాబోయే నూతన జంటను ఆశీర్వదించారు. గత కొద్ది రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్న ఆర్పీ.. సడెన్‌గా నిశ్చితార్థ వేడుకతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆర్పీ ఎంగేజ్‌మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Samayam Telugu కిరాక్ ఆర్పీ ఎంగేజ్‌మెంట్


జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. ఆ తరువాత నాగబాబుతో పాటే ఆ షో నుంచి బయటకు వెళ్లి పోయి.. అదిరింది షోలో మెరిశాడు. ఆ తర్వాత షోకు కూడా దూరమైనట్లు తెలిసింది. ఆ మధ్య కొద్దికాలం క్రితం డైరెక్టర్‌గా ఓ సినిమాను అనౌన్స్‌ చేశాడు. నాగబాబు, జేడీ చక్రవర్తి, రావు రమేష్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ మూవీకి ప్రొడ్యూసర్‌గా అరుణాచలం వ్యవహరిస్తుండగా.. చరణ్ అర్జుణ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. పలు సినిమాల్లో కూడా ఆర్పీ యాక్ట్ చేశాడు.


తాజాగా కిరాక్ ఆర్పీ ఎంగేజ్‌మెంట్‌తో అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా తాను ప్రేమించిన లక్ష్మీ అనే అమ్మాయిను పెళ్లి చేసుకోబోతున్నాడు. లక్ష్మీ నెల్లూరులో ఈవెంట్ మేనేజ్‌మెంట్ బిజినెస్ మొదలుపెట్టినట్లు తెలిసింది. వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు నాగబాబుతోపాటు నిహారిక, శివాజీ, హేమ, ధనరాజ్, కృష్ణభగవాన్, జబర్దస్త్ నటులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

View this post on Instagram A post shared by Jabardasth Deevena (@jabardasthdeevena)

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలని ఉందా..? సింపుల్.. ఇలా చేయండి

ఆ సమయంలో నిద్రలేని రాత్రులు గడిపా.. ISB జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.