యాప్నగరం

డబుల్‌మీనింగ్స్ పై రేష్మీ ఏమందంటే..

తన చేత డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించడం, ఎక్స్ పోజింగ్ చేయించడం..

TNN 24 Oct 2017, 9:01 am
రేష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అవేవీ నిలబడలేదు.
Samayam Telugu jabardasth reshmi reacts on double meanings in movies
డబుల్‌మీనింగ్స్ పై రేష్మీ ఏమందంటే..


ఈ నేపథ్యంలో ‘నెక్ట్స్ నువ్వే’లో ఈ జబర్దస్త్ భామ ముఖ్యపాత్రను చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల్లో తన చేత డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించడం, ఎక్స్ పోజింగ్ చేయించడం.. వంటి అంశాలపై స్పందించింది. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం అంటే అది తన వ్యక్తిగతం కాదు కానీ, సందర్భానుసారం దర్శకులు, రచయితలు చెప్పినట్టుగానే చేయాల్సి వస్తుందని, వారు రాసిన డైలాగులనే పలకవలసి వస్తుందని రేష్మీ స్పష్టం చేసింది. సినిమాల్లో డబుల్ మీనింగ్స్ పలకడం అంటే అది పాత్ర వరకే కానీ, తమ వ్యక్తిగతానికి సంబంధం ఉండదని స్పష్టం చేసింది.

ఇక తను చేసే ఎక్స్ పోజింగ్ విషయంలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తను 30 శాతం మాత్రమే స్కిన్ షో చేశానని రేష్మీ అంటోంది. అంతకు మించి చేయలేదని వ్యాఖ్యానించింది. సినిమా హీరోయిన్లు బికినీ ధరించడం ఈ రోజుల్లో చాలా సహజమే అని అంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.