యాప్నగరం

NTR బయోపిక్: ఆ పాత్రలో జగపతిబాబు!

కల్యాణ్ రామ్ కూడా ఒక ముఖ్య పాత్రలో...

TNN 30 Oct 2017, 9:06 am
తేజ దర్శకత్వంలో రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. బాలయ్య అంతా తానై రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ తెలుగు తారలంతా కనిపించే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో అనేక రియల్ లైఫ్ క్యారెక్టర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రముఖుల పాత్రలను ప్రముఖ నటీనటులే పోషిస్తారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోందని సమాచారం. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేయబోతున్నాడు.
Samayam Telugu jagapathibabu on cbn role in ntr biopic
NTR బయోపిక్: ఆ పాత్రలో జగపతిబాబు!


ఇక ఎన్టీఆర్ తనయుల పాత్రలు కూడా ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో హరికృష్ణ‌ పాత్ర కూడా కీలకం అని.. ఆ పాత్రను కల్యాణ్ రామ్ చేయబోతున్నాడని సమాచారం. తండ్రి పాత్రను ఈ విధంగా ఈ తనయుడు చేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్ర కూడా ఉంటుందని సమాచారం. దాన్ని చేయడానికి జగపతిబాబును ఎంచుకున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ అల్లుడి పాత్రలో జగపతి కనిపించబోతున్నాడట. ఇక ఇందులో మిగతా పాత్రలకు నటీనటుల ఎంపిక జరగబోతోందని.. ఓవరాల్ గా ప్రముఖ తారాగణమంతా ఈ సినిమాలో కనిపించడం ఖాయమని తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఈ సినిమాలో ఏదో ఒక ముఖ్య పాత్రలో చూపించాలనేది తేజ ప్రణాళికగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.