యాప్నగరం

బాప్‌రే!! ఈ సినిమాలో 29 పాటలు

ఈ సినిమాలో 29 పాటలుంటాయట! అవును, మీరు చదివింది నిజమే.

TNN 9 Feb 2017, 12:55 pm
ఈ సినిమాలో 29 పాటలుంటాయట! అవును, మీరు చదివింది నిజమే. అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న జగ్గా జాసూస్ చిత్రంలో మొత్తం 29 పాటలుండనున్నాయి. రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ కంపోజర్ ప్రీతమ్ చక్రవర్తి మ్యూజిక్ అందిస్తున్నారు. అనురాగ్ బసు డైరెక్షన్‌లో 2012లో వచ్చిన అవార్డ్స్ విన్నింగ్ ఫిలిం 'బర్ఫీ'కి మ్యూజిక్ అందించింది కూడా ప్రీతమ్ చక్రవర్తే కావడం విశేషం.
Samayam Telugu jagga jasoos 29 songs in ranbir kapoor and katrina kaifs next
బాప్‌రే!! ఈ సినిమాలో 29 పాటలు


బర్ఫీ మూవీతోనే బాలీవుడ్‌లో ఓ ప్రయోగం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనురాగ్ బసు ఈ సినిమాలోనూ రణ్‌బీర్ పాత్రతో మరోసారి ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. రణ్‌బీర్ ఈ సినిమాలో నత్తి గల వ్యక్తి పాత్ర పోషిస్తుండటమే అందుకు నిదర్శనం. ఈ సినిమా గురించి ప్రీతమ్ మాట్లాడుతూ... " సినిమాలో పూర్తిగా నత్తితో మాట్లాడే రణ్‌బీర్ తాను స్పష్టంగా చెప్పాలనుకున్నది చెప్పేది ఈ 29 పాటల్లోనే" అని అన్నారు. సినిమా కథనంలో భాగంగానే వచ్చే ఈ పాటలు జగ్గా జాసూస్ కథాంశాన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్తాయి అని చెప్పారు ప్రీతమ్.

ఈ సినిమా లాంచ్ అయిన రోజుల్లో లవ్ బర్డ్స్‌గా వున్న రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు ఇద్దరూ షూటింగ్ అనంతరం పరస్పర బేధాభిప్రాయాలతో విడిపోయి దూరమైన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.