యాప్నగరం

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఈద్ కానుక వచ్చేసింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఈద్ కానుక వచ్చేసింది. రేపే రంజాన్ పర్వదినం కావడంతో ఈ సందర్భంగా జై లవ కుశ...

Samayam Telugu 25 Jun 2017, 9:28 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఈద్ కానుక వచ్చేసింది. రేపే రంజాన్ పర్వదినం కావడంతో ఈ సందర్భంగా జై లవ కుశ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్. బాబీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ అప్‌కమింగ్ మూవీని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్టు కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Samayam Telugu jai lava kusa release date revealed
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఈద్ కానుక వచ్చేసింది

Here is a surprise little Eid gift for everyone. September 21st is Young Tiger @tarak9999's #JaiLavaKusaReleaseDate— NTR Arts (@NTRArtsOfficial) June 25, 2017
టెంపర్, నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి హిట్స్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో 'జై లవ కుశ'పై యంగ్ టైగర్ అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమాకు వున్న మరో ప్రత్యేకత ఏంటంటే... మొదటిసారిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌పై జూనియర్ హీరోగా కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమా కూడా ఇదే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.