యాప్నగరం

ఎన్టీఆర్‌ని 'జై లవ కుశ' డైరెక్టర్ ఏమన్నారో తెలుసా ?

ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమాను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ బాబీకి ఎన్టీఆర్ మీద...

TNN 23 May 2017, 12:43 pm
ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమాను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ బాబీకి ఎన్టీఆర్ మీద చాలా అభిమానం ఏర్పడినట్టుంది. అందుకే అతడిని, అతడికి వున్న టాలెంట్‌ని ఆకాశానికెత్తుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బాబీ. తారక్‌తో కలిసి ఇప్పటివరకు దాదాపు 47 రోజులు పనిచేశాను. కానీ ఏ రోజు కూడా వన్ మోర్ షాట్ అని చెప్పే అవకాశం తారక్ తనకి ఇవ్వలేదు అని అన్నారు బాబీ.
Samayam Telugu jai lava kusas director bobby appreciates jr ntr
ఎన్టీఆర్‌ని 'జై లవ కుశ' డైరెక్టర్ ఏమన్నారో తెలుసా ?


నిజంగా తారక్ గొప్ప నటుడు. చేసే పని పట్ల చాలా అంకిత భావం వున్న వ్యక్తి అని చెబుతూ ఎన్టీఆర్ జ్ఞాపక శక్తిని సైతం అభినందించారు బాబీ. 'ఎప్పుడో చెప్పిన స్క్రిప్టులోంచి సన్నివేశాలని గుర్తు పెట్టుకుని సెట్స్‌లో వున్న వారికి షాక్ ఇస్తూ వుంటారు తారక్' అని యంగ్ టైగర్‌కి వున్న టాలెంట్‌ని ప్రశంసించకుండా వుండలేకపోయారు ఈ డైరెక్టర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.