తమిళ సినిమాల్లో వైవిద్యానికి పెద్ద పీట వేస్తారనే సంగతి తెలిసిందే. సీన్ల నుంచి టైటిల్స్ వరకు ప్రతి ఒక్కటీ విభిన్నంగా ఉండేలా జాగ్రత్తపడతారు. తాజాగా నటుడు నితిన్ సత్య నిర్మిస్తున్న చిత్రానికి తెలుగు టైటిల్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘జర్నీ’ ఫేం జై హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘జరుగండి’ టైటిల్ ఖరారు చేశారు. దర్శకుడిగా పిచ్చుమనికి ఇది తొలి చిత్రం. తమిళలకు సుపరిచితమైన తెలుగు పదాల్లో ‘జరుగండి’ ఒకటని, టైటిల్ పరభాషదైనా తమ ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నిర్మాత నితిన్ సత్య ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో జై సరసన మలయాళం నటి రెబాజాన్ కథానాయిక. రోబో శంకర్, సిరుతై అమిత్, డేనీ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2018, ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.
తమిళ సినిమాకు తెలుగు టైటిల్!
తమిళ సినిమాల్లో వైవిద్యానికి పెద్ద పీట వేస్తారనే సంగతి తెలిసిందే. సీన్ల నుంచి టైటిల్స్ వరకు ప్రతి ఒక్కటీ విభిన్నంగా ఉండేలా జాగ్రత్తపడతారు.
TNN 18 Nov 2017, 11:03 am