యాప్నగరం

Pawan Kalyan: అన్నా నువ్ బద్దలకొట్టగలవ్.. చరిత్ర తిరగరాయగలవ్: పవన్ ఉద్వేగం

అన్నయ్యతో నేను సైరా లాంటి సినిమా చేయలేక పోయాను కానీ నా తమ్ముడు లాంటి రాం చరణ్ చేసాడు. ఈ సినిమాలో నేను నటించలేకపోయినా నా గొంతు వినిపించడం ఆనందంగా ఉంది.

Samayam Telugu 22 Aug 2019, 8:39 am
మెగాస్టార్ చిరంజీవి 64 పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో తాను నటించకపోయినా.. నా గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్.
Samayam Telugu Pawan Kalyan Chiranjeevi   Birthday Celebrations


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘మాకు కొణెదల అనే ఇంటి పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. నేను ఎప్పుడూ అడిగేవాడిని. అయితే కర్నూల్ జిల్లా నందికొట్కూరులో కొణెదల గ్రామం ఉంది. ఈ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కూడా కర్నూల్ ప్రాంత వాసి. ఈ సినిమా తెచ్చుకున్నది కాదు.. అన్నయ్యను వెతుక్కుంటూ వచ్చింది. అన్నయ్య చేస్తేనే న్యాయం జరుగుతుందని ఈ సినిమా మెగాస్టార్ దగ్గరకు వచ్చింది.

Read Also: అన్నయ్య గన్‌తో కాల్చుకుని చచ్చిపోదాం అనుకున్నా: పవన్ భావోద్వేగం

నిర్మాతను కూడా ఎవరో బయటి వారిని పెట్టుకోలేదు. ఒక కొణెదెల ఇంటిపేరు పెట్టుకున్న రామ్ చరణ్ ఈ సినిమాని చేస్తున్నారు. ఒక తమ్ముడిగా నేను చేయలేని పనిని నా తమ్ముడు లాంటి వాడు చరణ్ చేశారు. మా అన్నయ్యతో నాకు ఇలాంటి ఒక చారిత్రాత్మక సినిమా ఉండాలని కోరుకున్నాను కాని.. నాకు శక్తి, సమర్ధత లేకపోయాయి. కాని నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ చేయగలిగాడు.

ఎవరైనా తండ్రి కొడుకుని లాంఛ్ చేస్తాడు.. 150 సినిమాతో తండ్రిని కొడుకు రీ లాంఛ్ చేశాడు. ఇప్పుడు ప్రపంచ మొత్తం చెప్పుకునే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను రామ్ చరణ్ తెరపై ఆవిష్కరిస్తున్నాడు.

ఇలాంటి సినిమాలో వస్తే.. చిరంజీవి మాత్రమే ఆ పాత్రను చేయాలి.. తీస్తే రామ్ చరణ్ మాత్రమే తీయాలి. అందుకునే ఆ సినిమాకి ఎన్ని వందల కోట్లు అయినా వెనకడుకు వేయలేదు.

దర్శకుడు సురేందర్ రెడ్డి కల ఇది. ఈ చిత్రం ద్వారా తన కలను సాకారం చేసుకున్నారు. అన్నయ్య హీరోగా.. రామ్ చరణ్ నిర్మాతగా ఇలాంటి చక్కటి చిత్రం ద్వారా మన చరిత్రను మనం స్మరించుకునే అవకాశం వచ్చింది.

సింహం గురించి వేటగాడు చెప్పడం కాదు.. సింహమే బయటకు వచ్చి తనను గురించి తను చెప్తే కథ వేరేలా ఉంటుంది. అలాంటి సింహం కతే ఈ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి. భారత దేశపు చరిత్రకారులు మరిచి పోయారేమో.. కాని తెలుగునేల.. రేనేల ఈ కొణెదల మరిచిపోలేదు మరిచిపోలేదు ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ని.
ఈ కథ మన అందరికీ స్పూర్తిదాయకం’ అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.