యాప్నగరం

‘జై తెలంగాణ’ నినాదంతో హోరెత్తిన పవన్ ప్రసంగం

తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్ర రెండో రోజుకు చేరుకుంది.

TNN 23 Jan 2018, 1:03 pm
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. మొదటి విడత యాత్రలో భాగంగా ప్రజా సమస్యల అధ్యయనానికి తెలంగాణలోని మూడు జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రెండో రోజు కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో జనసేన కార్యకర్తలతో పవన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రసంగాన్నిచ్చారు.
Samayam Telugu janasena chief pawan kalyan telangana political tour day 2 live updates at karimnagar
‘జై తెలంగాణ’ నినాదంతో హోరెత్తిన పవన్ ప్రసంగం


ఈ సందర్భంగా.. ‘జై తెలంగాణ’ నినాదంతో పవన్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘జై తెలంగాణ’ నినాదానికి వందేమాతరం నినాదానికి ఉన్నంత ప్రాధాన్యత ఉందన్నారాయ. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అంటూ.. తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. ఈ తెలంగాణ నేలకు ఆఖరి శ్వాస వరకూ రుణపడి ఉంటానన్నారు.

ఎన్నో ఏళ్ల పోరాటం, ఎంతో మంది మహానుభావుల శ్రమతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నాలుగేళ్ల పసిబిడ్డ తెలంగాణ. నాకు తెలంగాణ యాస, భాషలంటే ఇష్టం అందుకే నా సినిమాలు తెలంగాణ సంస్కృతి, భాషలను గౌరవించేలా ఉంటాయన్నారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఎలా మెచ్చుకుంటారని తనను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారని వాళ్లు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే... మా అన్న చిరంజీవి కూడా కాంగ్రెస్ నాయకుడే అని. ప్రజల కోసం పనిచేసే ఏ నాయకుడన్నా తనకు ఇష్టమే అని.. అలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా గౌరవిస్తారన్నారు. నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు. నన్ను ద్వేషించే వారితో కూడా నాకు విభేదాలు లేవు. నాకు తెలంగాణ, ఆంధ్ర అనే ఫీలింగ్ నాకు లేదు. దేశం కోసం నా గుండె కొట్టుకుంటుందని ఆవేశంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్.

ఇక జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశాలను తెలియజేస్తూ.. అవినీతిపై పోరాటం, పర్యావరణాన్ని కాపాడే విధానాన్ని ప్రకటిస్తాం అన్నారు. 2009 నుండి రాజకీయాల్లో ఉన్నా.. మార్చి 14 లోపు పూర్తి రాజకీయ పార్టీగా జనసేన అవతరిస్తుందన్నారు.

కొన్ని కులాలకే రాజకీయాలు పరిమితం అయ్యాయి. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి. సామాజిక న్యాయం అంటే ఎన్నికల్లో సీట్లు కేటాయించడమే కాదు. కుల మత భేదాలు లేకుండా రాజకీయాలు జరగాలంటూ ‘జై తెలంగాణ’ నినాదంలో తన ప్రసంగాన్ని ముగించారు పవన్ కళ్యాణ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.