యాప్నగరం

Janasena kavathu: ‘పద పద పద పవనమై పద’ జనసేన కవాతు సాంగ్ ఇదిగో

ఈ నెల 15న జరిగే ‘జనసేన కవాతు’ కోసం ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు తమన్ ఈ సాంగ్‌కి మ్యూజిక్ అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

Samayam Telugu 13 Oct 2018, 7:43 pm
రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుదిశగా పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పోరాట యాత్రతో జనంలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఈ నెల 15న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా.. ధవళేశ్వరం బ్యారేజ్‌పై భారీ ఎత్తున కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లలలో నిమగ్నమయ్యారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఈ కార్యక్రమానికి లక్షలాదిగా జనసైనికులు తరలివచ్చేందుకు ఆయా ఏర్పాట్లలో ఉన్నారు. సోషల్ మీడియాలో ‘జనసేన కవాతు’పై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మధ్యాహ్నం రెండు గంటలకు జనసైనికులతో కలిసి కవాతు ప్రారంభిస్తారు పవన్. ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా ఈ కవాతు సాగుతుంది. అనంతరం జరిగే బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతారు.
తాజాగా ఈ కవాతు కోసం ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు తమన్ ‘జనసేన కవాతు’ సాంగ్‌కి మ్యూజిక్ అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఈ సాంగ్ రిలిక్స్‌ను విడుదల చేశారు. త్వరలో పూర్తి సాంగ్‌ను విడుదల చేస్తామంటూ.. సాంగ్ రికార్డింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘పద పద పద పవనమై పద’ అంటూ సాగిన ‘జనసేన కవాతు’ సాంగ్ లిరిక్స్ మీకోసం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.