యాప్నగరం

'జనతా గ్యారేజ్' ఎన్టీఆర్- దేవీశ్రీ సాంగ్ అదిరింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలుగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న 'జనతా గ్యారేజ్' . దేవీ శ్రీ ప్రసాద్ పాడిన దివినుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ..

TNN 20 Jul 2016, 2:08 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలుగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న 'జనతా గ్యారేజ్' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా డైలాగ్ టీజర్, సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ అభిమానుల అంచనాలను రెట్టింపు చేసింది. జూలై 22న ఆడియో విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఆసక్తి నెలకొన్న సమయంలో 'జనతా గ్యారేజ్' సాంగ్ లీక్ అయింది అంటూ 'దివినుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ' అంటూ సాగే ఓ పాట సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ కూడా దేవీ శ్రీ ప్రసాద్ పాడినట్లే ఉంది. మంచి మ్యూజిక్, బీట్లతో కంపోజ్ అయిన ఈ పాట ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి చూడాలి ఈ పాట సినిమాలో ఉంటుందో లేదో. ఎన్టీఆర్ సరసన మంత, నిత్యా మెనన్ హీరోయిన్లుగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్' మూవీ సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Samayam Telugu janatha garage song leaked
'జనతా గ్యారేజ్' ఎన్టీఆర్- దేవీశ్రీ సాంగ్ అదిరింది



Janatha Garage Leaked Song Going Viral On Internet

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.