యాప్నగరం

‘జంధ్యాల రాసిన ప్రేమకథ’‌ సెన్సార్ రిపోర్ట్

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’.

TNN 12 Nov 2017, 6:47 pm
కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త నటీనటులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24‌న రిలీజ్ కాబోతుంది.
Samayam Telugu jandhyala rasina premakatha movie censor completed
‘జంధ్యాల రాసిన ప్రేమకథ’‌ సెన్సార్ రిపోర్ట్


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రజంట్‌ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్‌ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. చిత్రం చాలా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ తో పాటు యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి గోపీ సంగీతాన్ని అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.