యాప్నగరం

‘సువర్ణ సుందరి’ టీజర్: ఎవ్వర్నీ వదలటం లేదు

‘సువర్ణ సుందరి’ టీజర్‌తో అలనాటి మేటి నటి జయప్రద ఎంట్రీ ఇచ్చింది. జయప్రద లీడ్‌ రోల్‌లో పూర్ణ, సాక్షి చౌదరి, రామ్,ఇంద్ర సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ ‘సువర్ణసుందరి’.

TNN 10 Nov 2017, 12:37 pm
‘సువర్ణ సుందరి’ టీజర్‌తో అలనాటి మేటి నటి జయప్రద ఎంట్రీ ఇచ్చింది. జయప్రద లీడ్‌ రోల్‌లో పూర్ణ, సాక్షి చౌదరి, రామ్,ఇంద్ర సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ ‘సువర్ణసుందరి’. సూర్య దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎమ్.ఎల్.లక్ష్మి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్ పూర్తి కావడంతో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
Samayam Telugu jaya prada and poorna suvarna sundari teaser released
‘సువర్ణ సుందరి’ టీజర్: ఎవ్వర్నీ వదలటం లేదు


‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతుంది’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ‘సువర్ణ సుందరి’ మూవీ టీజర్ విజువల్ వండర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గతానికి - భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రద పాత్రను సరికొత్తగా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్. డిజైన్ చేశాడు. నాలుగు శతాబ్ధాల పాటు జరిగిన వాస్తవ కథను రెండున్నర గంటల్లో విజువర్ వండర్‌గా తెరకెక్కిస్తూ ప్రయోగం చేస్తున్నాడు దర్శకుడు.

చరిత్ర దాచిన చారిత్రక తప్పిందం అంటూ ఎలు మహంతి విజువల్స్.. దర్శకుడి టేకింగ్.. పూర్ణ, సాక్షి చౌదరిల అందాల రాజసం.. జయప్రద స్టన్నింగ్ లుక్.. వెరసి ‘సువర్ణసుంద’ టీజర్ అభిమానుల అంచనాలకు మించే ఉంది. జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించగా.. యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిన ‘సువర్ణసుందరి’ చిత్రం వచ్చే డిసెంబర్‌లో విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.