యాప్నగరం

జయలలిత ఇక లేరు.. మరి త్రిష కోరిక తీరెదెలా ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఘన నివాళి అర్పించారు సినీనటి త్రిష.

TNN & Agencies 12 Dec 2016, 4:24 am
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఘన నివాళి అర్పించారు సినీనటి త్రిష. ఆదివారం ఉదయం తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ మెమోరియల్‌కు చేరుకున్న త్రిష... అక్కడే జయలలిత సమాధి వద్ద నివాళి ఘటించారు. జయలలిత మృతిచెందిన వెంటనే ట్విటర్ ద్వారా ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించిన త్రిష... చెన్నైలో అమ్మ చదువుకున్న సెక్రెట్ హార్ట్ స్కూల్లోనే చదువుకున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. అంతేకాకుండా గతంలో అమ్మని కలిసే అవకాశం రావడాన్ని కూడా తాను గొప్పగానే భావిస్తున్నట్టు తెలిపారు.
Samayam Telugu jayalalithaa death trisha pays respects to the late jayalalithaa
జయలలిత ఇక లేరు.. మరి త్రిష కోరిక తీరెదెలా ?

గత అక్టోబర్‌లో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ... " సీఎం జయలలితపై బయోపిక్ తెరకెక్కిస్తే, అందులో తానే జయలలిత పాత్రలో కనిపించాలనేది తన డ్రీమ్ రోల్" అని త్రిష పేర్కొన్న విషయం తెలిసిందే. సాధారణంగా గొప్పవాళ్ల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కించినప్పుడు... వాళ్ల రీల్ టైమ్ పాత్రల్లో ఎవరిని తీసుకోవాలనే స్వేచ్ఛ సదరు పాత్రలకి సంబంధించిన రియల్ వ్యక్తులకే అధికంగా ఉంటుంది. అలా వారి నిర్ణయం మేరకే తెరెకెక్కిన బయోపిక్ చిత్రాలు కూడా చాలానే వున్నాయి. కానీ ఈ సందర్భంలో జయలలిత పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయొచ్చు అనే నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుతం జయలలిత మన మధ్యలో లేరు. మరి జయలలిత బయోపిక్ తెరకెక్కించేందుకు ఎవరు ముందుకొస్తారు ? వాళ్లు జయలలిత పాత్ర కోసం త్రిషకే ప్రాధాన్యత ఇస్తారా ? లేక మరొకరిని తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.