యాప్నగరం

‘టిక్:టిక్:టిక్’ ట్రైలర్.. గ్రహశకలంతో యుద్ధం!

తమిళ హీరో జయం రవి సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ఎడిటర్ మోహన్ తనయుడైన రవి.. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమా రీమేక్ ద్వారా తమిళనాట హీరోగా తెరంగేట్రం చేశారు.

TNN 18 Jan 2018, 5:11 pm
తమిళ హీరో జయం రవి సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ఎడిటర్ మోహన్ తనయుడైన రవి.. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమా రీమేక్ ద్వారా తమిళనాట హీరోగా తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే బోలెడన్ని అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆ తరవాత ఆయనవన్నీ ప్రయోగాత్మక సినిమాలే చేశారు. లవర్ బాయ్‌గా పరిచయమై ఆ తరవాత యాక్షన్ సినిమాలతో తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. 2015లో ‘తని ఒరువన్’ సినిమాతో తమిళనాట మరింత క్రేజ్ సంపాదించారు. ఈ సినిమాను తెలుగులో రామ్ చరణ్ ‘ధృవ’ పేరుతో రీమేక్ చేశారు.
Samayam Telugu jayam ravi tik tik tik telugu movie trailer
‘టిక్:టిక్:టిక్’ ట్రైలర్.. గ్రహశకలంతో యుద్ధం!


ఇదిలా ఉంటే.. జయం రవి హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘టిక్‌:టిక్‌:టిక్’. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శకత్వం వహించిన ఈ చిత్రం సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ను సాయిధరమ్ తేజ గురువారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటేనే టెక్నికల్‌గా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. భూమికి గ్రహశకలం నుంచి ముప్పు పొంచి ఉంటుంది. ఆ గ్రహశకలం వల్ల మన దేశానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. దీన్ని ఓ అణ్వాయుధంతోనే నాశనం చేయగలం. దాన్ని ఎలా నాశనం చేశారనేదే చిత్రం. దీన్ని సూచన ప్రాయంగా ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచారు.
Here we go guys the Telugu trailer of #TikTikTik @actor_jayamravi @ShaktiRajan @NPethuraj and the whole team of #TikTikTikTelugu https://t.co/KzhElYCMcf all the best guys 👍🏼👍🏼👍🏼 — Sai Dharam Tej (@IamSaiDharamTej) January 18, 2018
ఈ చిత్రంలో జయం రవికి జంటగా నివేదా పెతురాజ్ నటించింది. జయప్రకాష్, ఆరోన్ అజీజ్, రమేష్ తిలక్, విన్సెంట్ అశోకన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. డి. ఇమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్టీటీవీ ఫిల్మ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ విడుదల చేస్తున్నారు. జనవరి 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.