యాప్నగరం

రాశీఖన్నాకు మరో క్రేజీ ఆఫర్!

టాలీవుడ్‌లో నటించే హీరోయిన్లందరూ ఒక స్టేజ్ వచ్చిన తరువాత తమిళ ఇండస్ట్రీకు షిఫ్ట్ అవుతుంటారు.

TNN 9 Dec 2017, 7:43 pm
టాలీవుడ్‌లో నటించే హీరోయిన్లందరూ ఒక స్టేజ్ వచ్చిన తరువాత తమిళ ఇండస్ట్రీకు షిఫ్ట్ అవుతుంటారు. కొందరు ఏకకాలంలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తుంటారు. స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్, తమన్నా వంటి వారు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు రాశిఖన్నా కూడా కోలీవుడ్‌కు క్యూ కడుతున్న భామల లిస్ట్‌లో చేరింది.
Samayam Telugu jayam ravi to romance raashi khanna next
రాశీఖన్నాకు మరో క్రేజీ ఆఫర్!


రీసెంట్‌గా మలయాళంలో మోహన్ లాల్‌తో కలిసి 'విలన్' సినిమాలో నటించిన రాశి.. ప్రస్తుతం సిద్ధార్థ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్‌తో పాటు తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న ఓ భారీ సినిమాలో కథానాయికగా రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. జయం రవి హీరోగా కార్తీక్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమాలో లీడ్ రోల్ కోసం రాశిని తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాట జయం రవి క్రేజ్ బాగానే పెరిగింది. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి సినిమాలో అవకాశం సంపాదించడం రాశికి మంచి అవకాశమనే చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.