యాప్నగరం

వీరితో సుకుమార్ సినిమా తీస్తాడంట

శ్రీనివాసరెడ్డి, పూర్ణ హీరోహీరోయిన్లుగా శివరాజ్ కనుమూరి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జయమ్ము నిశ్చయమ్మురా'. సమైక్యంగా నవ్వుకుందాం అనేది ట్యాగ్ లైన్...

TNN 7 Oct 2016, 3:04 pm
శ్రీనివాసరెడ్డి, పూర్ణ హీరోహీరోయిన్లుగా శివరాజ్ కనుమూరి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జయమ్ము నిశ్చయమ్మురా'. సమైక్యంగా నవ్వుకుందాం అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలోని సాంగ్ టీజర్ ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ఫుటేజ్ చూసి తాను స్పిల్ బౌండ్ అయ్యానని ఈ సందర్భంగా సుకుమార్ అన్నారు. శివరాజ్ మా ఊరు మట్టపర్రు కుర్రాడని చెప్పుకోవడానికి చాల గర్వపడుతున్నానని అయన అన్నారు. అంతేకాకుండా తన సొంత బ్యానర్ అయిన 'సుకుమార్ రైటింగ్స్' లో శివరాజ్ కనుమూరిని దర్శకుడిగా పెట్టి సినిమా నిర్మిస్తానని సుకుమార్ ప్రకటించారు.
Samayam Telugu jayammu nischayammu raa coming with pure desi comedy
వీరితో సుకుమార్ సినిమా తీస్తాడంట




కాగా, సుకుమార్ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తాను నిర్మించానని, సినిమా రష్ చూసిన ఆయన అందరికీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతుండడంతో పాజిటివ్ బజ్ ఏర్పడిందని శివరాజ్ తెలిపారు. నవంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.