యాప్నగరం

‘జయమ్ము నిశ్చయమ్మురా’కి ఫుల్ బిజినెస్

గీతాంజలి సినిమాతో హీరోగా అలరించిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాజాగా మరో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

TNN 29 Oct 2016, 1:45 pm
గీతాంజలి సినిమాతో హీరోగా అలరించిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాజాగా మరో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన కామెడీ టచ్ ఉన్న డైలాగులతో, కామిక్ టైమింగ్‌తో మంచి కమెడియన్స్‌లో ఒకరిగా పేరు సంపాదించాడు. ఇటీవల విడుదలైన నాగచైతన్య ‘ప్రేమమ్’సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సినిమాకి ప్లస్ అయ్యాడు.
Samayam Telugu jayammu nishchayammura pre release business creates sensation
‘జయమ్ము నిశ్చయమ్మురా’కి ఫుల్ బిజినెస్


తాజాగా శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’టీజర్‌తో ఇటీవలే విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ టీజర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వల్ల సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని, తమిళ స్టార్ హీరో విక్రమ్ గత చిత్రం ‘ఇంకొక్కడు’ తెలుగులో విడుదల చేసిన నిర్మాత నీలం కృష్ణా రెడ్డి ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ మొత్తాన్నీ సుమారు 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకులముందుకు రాబోతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.