యాప్నగరం

నితిన్ కపూర్‌ సూసైడ్ పై జయసుధ స్పందన

ప్రముఖ సినీనటి జయసుధ తన భర్త నితిన్ కపూర్ మరణంపై సోషల్ మీడియాలో స్పందించారు.

TNN 17 Mar 2017, 3:38 pm
ప్రముఖ సినీనటి జయసుధ తన భర్త మరణంపై సోషల్ మీడియాలో స్పందించారు. ఇటీవల జయసుధ భర్త నితిన్ కపూర్ సూసైడ్ చేసుకుని మరణించడంతో మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అప్పటినుండి మీడియాకు దూరంగా ఉన్న జయసుధ తన భర్త మరణంపై స్పందించలేదు. తాజాగా.. తన ఫేస్ బుక్ ఖాతాలో తమ వివాహబంధం గురించి తెలియజేస్తూ.. నితిన్‌తో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు.
Samayam Telugu jayasudha reaction about nitin kapoors sudden death
నితిన్ కపూర్‌ సూసైడ్ పై జయసుధ స్పందన


అంతేకాదు ఈరోజు (మార్చి17) మా పెళ్లి రోజు.. 32 ఏళ్లు చాలా అన్యోన్యంగా ఉన్నాం కాని ఈ రోజు నితిన్ తనతో ఉండకుండా దేవతలతో ఉన్నారంటూ.. ఆయన కోరుకున్న శాంతి ఇప్పటికి దొరికిందని, ఆయన ఎక్కడ ఉన్నా తనను తన కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటారనే నమ్మకం ఉందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నానని తెలియజేశారు జయసుధ.

మనోవేదన అనేది ఎవరికీ చెప్పుకోలేని సమస్య అని.. అయితే మీడియాలో తన వివాహ బంధంపైన, నితిన్ కపూర్ ఆర్థిక వ్యవహారాలపైన భిన్న కథనాలు రావడంతో కొంత అసహనానికి గురైనా.. నా జీవితంలోని ఈ చీకటి కోణాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు జయసుధ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.