యాప్నగరం

మూడేళ్ల క్రితమే చావు నుంచి తప్పించుకున్న జయసుధ భర్త

సహజ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నితిన్ కపూర్‌ది ఆత్మహత్యా...

Samayam Telugu 14 Mar 2017, 8:41 pm
సహజ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నితిన్ కపూర్‌ది ఆత్మహత్యా లేక సహజ మరణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయసుధ సినిమాల్లో బిజీగా వుండగా నితిన్ కపూర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. బాలీవుడ్ నటుడు జీతేంద్ర కపూర్‌కి సోదరుడైన నితిన్ కపూర్ తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలు కూడా నిర్మించారు.
Samayam Telugu jayasudhas husband nitin kapoor escaped death three years ago in hyderabad
మూడేళ్ల క్రితమే చావు నుంచి తప్పించుకున్న జయసుధ భర్త


ఇదిలావుంటే, ఇవాళ నితిన్ కపూర్ మృతి చెందడంతో అతడికి మూడేళ్ల క్రితమే ఎదురైన ఓ ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటున్నారు అతడి సన్నిహితమిత్రులు. అవును, మూడేళ్లక్రితమే హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో నితిన్ కపూర్ చావు నుంచి తప్పించుకున్నారు. 2013, సెప్టెంబర్ 10న నితిన్ కపూర్ ప్రయాణిస్తున్న కారు గచ్చిబౌలి వద్ద నిప్పంటుకుని వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది.

అదృష్టవశాత్తు వాహనంలోంచి వెలువడుతున్న పొగ వాసనను ముందుగానే గుర్తించిన నితిన్ కపూర్.. అందులోంచి కిందికి దిగి ఏం జరుగుతుందా అని చెక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అలా ఆయన కారులోంచి కిందికి దిగీ దిగగానే వెంటనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుని తగలబడిపోయింది. అప్పట్లో అదృష్టవశాత్తూ అలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిన నితిన్ కపూర్ ఇవాళ ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సినీవర్గాలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.