యాప్నగరం

‘కీ’ ట్రైలర్.. జీవా ఈజ్ బ్యాక్

జీవా, నిక్కి గల్రాని, అనైక సోటి హీరో హీరోయిన్లుగా నటించిన ‘కీ’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

Samayam Telugu 26 Mar 2019, 9:06 pm
రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో జీవా ‘కీ’ అనే సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీవా, నిక్కి గల్రాని, అనైక సోటి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో అనువాదం చేశారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Samayam Telugu Key Movie Telugu Trailer


‘ఇంకా 30 సెకన్లు. మనం వాళ్లను కనిపెట్టకపోతే.. వాళ్లే మనల్ని కనిపెట్టేస్తారు’ లాంటి డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం థ్రిల్లింగ్‌గా ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ సైకిలాజికల్ డ్రామాగా ‘కీ’ చిత్రాన్ని రూపొందించారు. ఎన్నాళ్లగానో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న జీవా ఈ చిత్రంతో గట్టి హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘జీ’ మూవీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.