యాప్నగరం

సహజీవనం చేసి వదిలేశాడు.. జూనియర్ ఆర్టిస్ట్ హేమ ఆందోళన

జూనియర్ ఆర్టిస్ట్ హేమ మౌనదీక్షకు దిగింది. ఆర్టిస్ట్ నవతేజ్ తనను పెళ్లి చేసుకొని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Samayam Telugu 19 Dec 2018, 12:09 am
ప్పటికే పెళ్లై పిల్లలున్న విషయం తెలిసి కూడా సాన్నిహిత్యం పెంచుకున్నాడు. కొంత కాలం పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు వ్యతిరేకించడంతో వదిలేసి పారిపోయాడు. దీంతో ఓ జూనియర్ ఆర్టిస్ట్, టీవీ యాంకర్ ఆందోళనబాట పట్టింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తనను వదిలించుకోవాలని చూస్తున్న భర్తను తన వెంట పంపాలని వేడుకుంది.
Samayam Telugu hema2


హైదరాబాద్‌కు చెందిన హేమ.. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌‌గా, టీవీలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఆత్మకూరు పట్టణంలోని క్రిస్టియన్‌పేటకు చెందిన నవతేజ్‌ సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది.

హేమకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉంటోంది. మూడేళ్ల కిందట ఈమెకు హైదరాబాద్‌లో నవతేజ్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగడంతో సహజీవనం చేశారు. 2017 ఆగస్టు 4న పెద్దమ్మ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే.. హేమ, నవతేజ్ వయసులో తేడా ఎక్కువగా ఉండటం వల్ల నవతేజ్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. కుమారుడ్ని వెంట తీసుకెళ్లిపోయారు. నాటి నుంచి నవతేజ్‌.. హేమకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గత జూన్‌లో హేమ ఆత్మకూరు వచ్చింది. న్యాయం చేయాలని పోలీసులను కోరింది. కానీ, నేటివరకు తనకు న్యాయం జరగలేదని హేమ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 17) హేమ మరోసారి ఆత్మకూరు వచ్చి నవతేజ్ ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. నవతేజ్‌ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పోలీస్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఆమె కూడా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భర్తను తన వెంట పంపాలని కోరింది. అయితే.. హేమ కొన్ని నెలల కిందటే హైదరాబాద్‌లో నవతేజ్‌పై ఫిర్యాదు చేసింది.

ఆత్మకూరు ఎస్సై నరేశ్.. హైదరాబాద్‌లోని పోలీసులతో మాట్లాడారు. హైదరాబాద్ పోలీసుల ఎదుట నవతేజ్ హాజరవుతాడని.. లేనిపక్షంలో అతడిపై కేసు నమోదుచేసి అరెస్టు చేస్తామని ఎస్సై నరేశ్ ఆమెకు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపిన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై హేమ గతంలో సంచలన ఆరోపణలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.