యాప్నగరం

‘ఎమ్మెల్యే’ ఫంక్షన్‌కి తారక్ గెస్ట్!

నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జోడీగా తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది.

Samayam Telugu 12 Mar 2018, 10:43 pm
నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జోడీగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది. ‘ఎమ్మెల్యే’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు ఉపేంద్ర మాధమ్. ‘ఎమ్మెల్యే’ టైటిల్ పాటు టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
Samayam Telugu jr ntr as chief guest for mla audio launch
‘ఎమ్మెల్యే’ ఫంక్షన్‌కి తారక్ గెస్ట్!


ఈ నెల 17 కర్నూల్‌లో జరిగే ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరౌతున్నట్లు సమాచారం. ఇటీవల ఎన్టీఆర్ ‘లవకుశ’ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మాతగా సొంత బ్యానర్‌లో నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూట్‌కు రెడీ కాగా... రామ్ చరణ్‌తో రాజమౌళి దర్శకత్వంలో పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎమ్మెల్యే’ ఆడియో ఫంక్షన్‌లో తారక్.. రాజమౌళి మూవీపై హింట్ ఇస్తారేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.