యాప్నగరం

కత్తి కథ కంచికి.. బిగ్‌బాస్ నుంచి ఇంటికి!

Bigg Boss Telugu episode 28: తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 27 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 28 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.

TNN 12 Aug 2017, 11:59 pm
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌ చేస్తున్న బిగ్ బాస్ షో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బెగ్గెస్ట్ రియాలిటీ షో. ఇటీవల ప్రారంభమైన ఈ షో 27 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 28వ ఎపిసోడ్‌లోకి ఎంటరైపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. శని, ఆదివారాల్లో బిగ్‌బాస్‌‌ షోలో బాద్ షా ఎంట్రీ ఇస్తుండటంతో మరింత జోష్‌తో నడిచింది ఈ షో. మరోవైపు బిగ్ బాస్ హౌస్‌నుండి ఒకేసారి ఇద్దరు కన్టెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్‌లో ఉండటంతో ఆసక్తిగా సాగింది. ఇక ఎన్టీఆర్ తనదైన స్టైల్‌లో బిగ్ బాస్‌కి ఎప్పటిలాగే ఈవారం కూడా రాకింగ్ ఎంట్రీ ఇచ్చేశాడు. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన శివబాలాజీకి శుభాకాంక్షలను తెలియజేస్తూ.. కెప్టెన్‌ అవకాశంతో మరో బంపర్ ఆఫర్ ఇస్తున్నామని ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న శివబాలాజీ సేఫ్ అయ్యారని ఎన్టీఆర్ తెలపడంతో ఎలిమినేషన్ జోన్ నుండి శివబాలాజీ బయటపడ్డాడు.
Samayam Telugu jr ntr bigg boss episode 28 in telugu
కత్తి కథ కంచికి.. బిగ్‌బాస్ నుంచి ఇంటికి!


ఇక హౌస్‌లో ఇప్పటి వరకూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న అర్చన, హరితేజలు గొడవపడటం.. ముమైత్ ఖాన్ అర్చన ఫైర్ అవ్వడం ఆతరువాత సారీచెప్పడం ఎప్పటిలాగే జరగగా.. హౌస్‌లో ఉన్న వారిని నా టీవీ ద్వారా పలికరించారు ఎన్టీఆర్. హౌస్‌లో ఉన్న ముమైత్ ఖాన్ ఆటపట్టిస్తూ.. ఏంటీ హౌస్‌లోకి మంచి అబ్బాయి కావాలంటూ కాకాపడుతున్నావ్ ఏంటీ? అనగా తెగ సిగ్గుపడిపోతూ అవును నాకు ఒక అబ్బాయి కావాలంటూ ఎన్టీఆర్‌ని అడిగింది ముమైత్. ఇక అర్చన అస్తమానూ బాలీ.. బాలీ అంటుంటావ్ ఏంటి బాలీ అంటే ఎవరు ఇంతకీ బాలీ అని అడగగా.. బాలీ అంటే తన లవర్ అని ఆ పేరుతో వీళ్లు నన్ను ఏడిపిస్తారంటూ అసలు పేరు వేరే అంటూ తన ప్రేమ రహస్యాన్ని బయట పెట్టింది అర్చన. అయితే తన పేరు T తో మొదలై y తో ఎండ్ అవుతుంది కదా అని ఎన్టీఆర్ అనడంతో అవును అంటూ తెగ సిగ్గు పడిపోయింది అర్చన. ఇక ప్రిన్స్ నువ్ డ్రాప్ అయితే తను ఫిక్స్ అయిపోయిందని ఎన్టీఆర్ ప్రిన్స్‌కి పంచ్ వేయగా.. తాను మిడిల్ డ్రాప్ అయినట్టు ప్రిన్స్ తెలిపాడు.

ఇక బిగ్‌బాస్‌లో ఉన్న సెలబ్రిటీల ప్రవర్తనపై నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయని వాటిని మీకు కొన్ని వీడియోల ద్వారా చూపిస్తానని వాటిపై మిగిలిన సభ్యులు కూడా అభిప్రాయాన్ని తెలియజేయలన్నారు.

We have seen @tarak9999 's fun side...It's going to be different tonight #BiggBossTelugu Today at 9:00 PM #OPPOBiggBoss @oppomobileindia pic.twitter.com/hhNfjV7BBV — STAR MAA (@StarMaa) August 12, 2017
ఇందులో మహేష్ కత్తి, అర్చన, ధనరాజ్, హరితేజ, ఆదర్శ్ వీడియోలను ప్లే వాళ్లు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ కోరారు ఎన్టీఆర్. అయితే వారు ఇచ్చిన సమాధాలతో ఎన్టీఆర్ కాస్త సీరియస్‌గానే స్పందించారు. ఇక హౌస్‌లో తన ప్రవర్తన అలా ఉండాల్సింది కాదని మహేష్ కత్తి తన తప్పును ఒప్పుకోవడంతో మీరు చేసిన తప్పును నాతో పాటు ప్రేక్షకులు కూడా క్షమించలేదని అందుకే ఈవారం మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్‌నుండి ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించి మహేష్ కత్తిని బిగ్ బాస్ హౌస్‌నుండి ఇంటికి పంపించారు. ఇక బిగ్ బాస్ హౌస్‌ను వీడే సెలబ్రిటీకి ప్రతివారం ఇచ్చే బిగ్ బాంబ్ ఆయుధాన్ని మహేష్ కత్తికి అందించగా.. దాన్ని తనకు నచ్చని ఆదర్శ్‌పై విసిరాడు. దీంతో బిగ్‌బాస్ నుండి అనౌన్స్‌మెంట్ వచ్చేంతవరకూ హౌస్‌లో ఉన్న ప్లేట్లు గిన్నెలు కడగాలని ఆదర్శ్‌‌పై మహేష్ కత్తిపై బిగ్ బాంబ్ వదిలాడు.

ఇక ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో శివబాలాజీ సేఫ్ జోన్‌లోకి రాగా.. మహేష్ కత్తి ఎలిమినేట్ అవ్వగా హరితేజ, కల్పన, దీక్షల్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇక బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో సెలబ్రిటీ రాబోతున్నట్టు టీజర్ వదిలారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీ ఎవరో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే!

Read Bigg Boss Telugu Updates Here: బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్‌లు ఒక్కక్లిక్‌తో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.