యాప్నగరం

బిగ్‌బాస్‌లో ‘వీడెవడు’.. అర్చన పబ్లిక్ కిస్?

బిగ్‌బాస్ బాస్ టైటిల్.. 50 లక్షల ఫ్రైజ్ మనీకోసం బిగ్ బాస్ హౌస్‌లో వార్ నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. ఇప్పటికి 47 ఎపిసోడ్‌లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసి 48వ ఎపిసోడ్‌లో ఎంటర్ అయ్యింది బిగ్‌బాస్ షో.

TNN 3 Sep 2017, 1:52 am
బిగ్‌బాస్ బాస్ టైటిల్.. 50 లక్షల ఫ్రైజ్ మనీకోసం బిగ్ బాస్ హౌస్‌లో వార్ నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. ఇప్పటికి 47 ఎపిసోడ్‌లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసి 48వ ఎపిసోడ్‌లో ఎంటర్ అయ్యింది బిగ్‌బాస్ షో. ఇక ఈ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్‌లో ఉప్పు నిప్పులా ఉన్న దీక్ష- అర్చనల మధ్య మరోసారి వివాదం రేగింది. ఇప్పటికే పలుసార్లు ఎలిమినేషన్ జోన్ నుండి తప్పించుకున్న దీక్ష మిగిలిన టీం మేట్స్‌పై సమయం వచ్చినప్పుడల్లా తన అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. కాఫీ కోసం దీక్ష, అర్చన మధ్య వివాదం రేగగా శివబాలాజీ కలగజేసుకుని దీక్షకు క్లాస్ పీకాడు. కాఫీ కావాలంటే అడగాలని ఎవరూ తెచ్చిఇవ్వరని ఇలాంటి చిన్న చిన్న విషయాలకోసం గొడవ పడటం చాలా సిల్లీగా ఉందంటూ ఫైర్ అయ్యాడు.
Samayam Telugu jr ntr bigg boss episode 48 in telugu
బిగ్‌బాస్‌లో ‘వీడెవడు’.. అర్చన పబ్లిక్ కిస్?


ఇక హౌస్ కెప్టెన్‌గా ఉన్న ముమైత్ ఖాన్ దీక్షకు కాఫీ ఇవ్వాలంటూ అర్చనను అడగగా.. దీక్ష తనను చాలా సార్లు హర్ట్ చేసిందని అందుకే తనకు కాఫీ ఇవ్వనని తెగేసి చెప్పేసింది. మరోవైపు తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తాను గట్టిగా మాట్లాడుకుంటుండగా.. అది చూసిన ప్రిన్స్ షాక్ అయ్యాడు. ఈమెకు ఏదో అయ్యిందంటూ ప్రిన్స్ ఆదర్శ్‌తో చెప్తూ ఆటపట్టించాడు. ఇక అయ్యిందేదో అయ్యిందని ఇక నుండి హౌస్‌లో ఫ్రెండ్స్‌గా ఉందాం అంటూ దీక్ష- అర్చనకు డీప్ హగ్ ఇవ్వడంతో అదిచూసిన అర్చన అవాక్కయ్యింది.

Read Bigg Boss Telugu Updates Here: బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్‌లు ఒక్కక్లిక్‌తో

మరోవైపు బిగ్ బాస్‌లో కన్టెస్టెంట్స్ కోసం మరో సీఎట్ ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందుకోసం హౌస్ సెలబ్రిటీలు రెండు గ్రూపులుగా విడిపోతారని ముమైత్ సారధ్యంలో ఈ గేమ్ జరుగుంతుందన్నారు. ఇందులో టీంAలో మమైత్, హరితేజ, శివబాలాజీ, ప్రిన్స్‌లు ఉండగా.. టీంBలో దీక్ష, అర్చన, ఆదర్శ్, నవదీప్‌లు రంగంలోకి దిగారు. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో ముమైత్ టీం.. నవదీప్ టీంపై గెలిచించి.

ఇక శివబాలాజీని హౌస్‌లోనే ఏగలేకపోతున్నాం ఆమె భార్య ఎలా ఉంటుందో ఆమెకు దండం పెట్టాలని ఉందని.. ఒకసారి మనందరం కలిసి శివబాలాజీని కుమ్మేద్దామంటూ ప్లాన్ చేశారు హరితేజ, ముమైత్, దీక్ష, అర్చనలు. ఇంతలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘మౌనమేలనోయి’ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ స్పెషల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటిస్తున్న ‘వీడెవడు’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశారు సచిన్. సెలబ్రిటీలతో కలిసి రోజీ లిప్ టాస్క్ ఇచ్చారు. దీంతో రోజా పువ్వును లిప్స్‌తో అందిస్తూ తమ జీవితంలోని మధురానుభూతులను తెలపాలంటూ సచిన్ కూడా జాయిన్ అయ్యారు ఈ గేమ్‌లో.

ఈ రోజ్ లిప్‌లో గేమ్‌లో అర్చనకు ఫస్ట్ చాన్స్ రాగా తన బాయ్ ఫ్రెండ్‌తో జరిగిన ఇన్సిడెంట్‌ను హౌస్ మేట్స్‌తో పంచుకుంది. బిగ్ బాస్ హౌస్ కి రాకముందు ముంబాయి నుండి తన కోసం ఆ అబ్బాయి హైదరాబాద్ వచ్చాడని అతనితో కలిసి బయటకు వెళ్లామని అయితే పబ్లిక్ తనను గుర్తు పట్టడంతో ఇక్కడ కంఫర్ట్‌గా లేదు వెలిపోదాం అన్నాడని చెప్పింది. ఇంతకీ ఎక్కడకి వెళ్లారు ఏం చేశారు అని హౌస్ మేట్స్ అడగటంతో.. కార్‌లో కిస్ చేసుకున్నాం అంటూ సిగ్గుపడకుండా చెప్పేసింది. వామ్మో పబ్లిక్‌లో కిస్ చేసుకున్నారా అంటూ మిగిలిన సెలబ్రిటీలు షాక్ అయ్యారు.

. @sachiinjoshi visits Bigg Boss House#BiggBossTelugu Today at 9:30 PM on @StarMaa #OPPOBiggBoss @oppomobileindia pic.twitter.com/LoW6eK1Fot — STAR MAA (@StarMaa) September 1, 2017
నెక్ట్స్ ఒకరి తరువాత ఒకరు తమ మధురానుభూతులను పంచుకున్నారు. హరితేజ పెళ్లికు ముందు తన బాయ్ ఫ్రెండ్‌తో గదిలో గడిపిన విషయాన్ని కూడా బయటపెట్టేసింది. గేమ్ అనంతరం ముమైత్ ఖాన్‌ను సర్ ప్రైజ్ చేస్తూ తన 32వ బర్త్ డే కేక్‌ను కట్ చేయించి శుభాకాంక్షలను తెలియజేశారు హౌస్ మేట్స్. అనంతరం తన బర్త్ డే సందర్భంగా తన కోసం హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారో చెప్పాలంటూ అవి నాకు ఉపయోగపడొచ్చని ముమైత్ కోరడంతో ఆమెను ఉద్దేశించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.