యాప్నగరం

స్సైడర్ VS జై లవకుశ: వార్ వన్ సైడ్ కాదు

టాలీవుడ్‌లో అసలు సిసలు సినిమా సందడి మొదలైంది. దసరాకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’, యంగ్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాలతో పాటు శర్వానంద్ ‘మహానుభావుడు’ కూడా పండుగ రేస్‌లో నిలుస్తుండటంతో సినీ లవర్స్ ఈ చిత్రాలకోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

TNN 18 Sep 2017, 5:33 pm
టాలీవుడ్‌లో అసలు సిసలు సినిమా సందడి మొదలైంది. దసరాకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’, యంగ్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాలతో పాటు శర్వానంద్ ‘మహానుభావుడు’ కూడా పండుగ రేస్‌లో నిలుస్తుండటంతో సినీ లవర్స్ ఈ చిత్రాలకోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అన్నింటికంటే ముందుగా ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న రిలీజ్ కానుండగా.. స్పైడర్ 27న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ జై లవకుశ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఎన్టీఆర్ బిగ్‌బాస్ షోను ఈ మూవీ ప్రమోషన్స్‌కు ఉపయోగించి సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ దసరా పండుగకు వస్తున్న సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu jr ntr feels threatened by mahesh babus spyder
స్సైడర్ VS జై లవకుశ: వార్ వన్ సైడ్ కాదు


స్పైడర్, జై లవకుశ సినిమాలు దసరాకు రిలీజ్ కానుండటంతో మీ మధ్య వార్ ఉంటుందని భావిస్తున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై ఎన్టీఆర్ తనసహజ శైలిలో స్పందించారు. ఒకే టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని వార్ అని నేను అనుకోనని కేవలం పోటీతత్వంగానే భావిస్తానన్నారు. తాను ఇంతకు ముందు కూడా చెప్పానని ఏ రంగంలోనైనా స్పూర్తిదాయకమైన పోటీ ఉండాలని అప్పుడే ఆ రంగంలో ముందుకు వెళ్లగలమన్నారు.

ఆ పోటీ ఉంటేనే మనలోని లోపాలే ఏంటో బయటకు తెలుస్తాయని.. నాకంటే బాగా నటించారు. నేను అంతకంటే బాగా చేయలనే తపన పెరుగుతుందని ఆ తపన ఉంటే సక్సెస్ ఇప్పుడు కాకపోయినా తరువాతైనా మన సొంతం అవుతుందన్నారు. నిజానికి ప్రేక్షకుడు ఎన్ని సినిమాలు రిలీజైనా ఎంజాయ్ చేస్తాడని ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే పండగలా భావిస్తాడన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెం.150, బాబాయ్ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, శతమానంభవతి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయని అన్నీ ప్రేక్షకాదరణ పొందాయన్నారు. ఇలా ఒకేసారి వంద సినిమాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని అది ఇండస్ట్రీకే మంచిదన్నారు.

ఇక స్పైడర్, జై లవకుశ సినిమాల మధ్య అసలు వార్ అనేదే లేదని ఏ సినిమా బాగుంటే ప్రేక్షకుడు ఆ సినిమా చూస్తాడు. ఒకవేళ రెండు బాగుంటే రెండూ చూస్తాడు అంతిమ నిర్ణయం ప్రేక్షకదేవుళ్లదే అన్నారు. మొత్తానికి ఎన్టీఆర్ లేటెస్ట్ కామెంట్స్ అటు మహేష్ ఫ్యాన్స్‌లోనూ, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనూ స్పూర్తినింపేవిగా ఉన్నాయి. మామధ్య ఎలాంటి వార్ లేదు మీరు కూడా ఎలాంటి వార్‌లకు దిగొద్దని చెప్పకనే చెబుతున్నాడు ఎన్టీఆర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.