యాప్నగరం

త్రివిక్రమ్ కన్నా ముందు బాబీతో ఎన్టీఆర్ సినిమా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని.. హాసిని హారిక బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుందని...

TNN 28 Nov 2016, 12:59 am
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని.. హాసిని హారిక బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుందని మొన్నామధ్య వార్తలొచ్చాయి. అదే సమయంలో సర్ధార్ గబ్బర్‌సింగ్, పవర్ చిత్రాల దర్శకుడు బాబి చెబుతున్న కథలు కూడా వింటున్నాడని తెలిసింది. కానీ ఎవరితో ఎన్టీఆర్ సినిమా ముందుగా ఉంటుందనే విషయలో మాత్రం క్లారిటీ కొరవడింది.
Samayam Telugu jr ntr has decided to act under bobby direction before trivikrams movie
త్రివిక్రమ్ కన్నా ముందు బాబీతో ఎన్టీఆర్ సినిమా


అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు దర్శకులలో ముందుగా బాబితోనే ఎన్టీఆర్ సినిమాకు ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. అందుకు కారణం త్రివిక్రమ్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా వుండటంతోపాటు పవన్ కల్యాణ్‌తో మరో సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అటు పవన్ మాత్రం ప్రస్తుతం కాటమరాయుడు మూవీతో బిజీగా వున్నాడు. పవన్ ఆ సినిమాను పూర్తి చేసుకుంటే కానీ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కించలేడు. అలా పవన్‌తో త్రివిక్రమ్ సినిమా పూర్తవడానికి చాలా సమయం పడుతుంది కనుక ఆలోగా బాబీతో సినిమాని చేద్దామని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టుగా సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.

అంతేకాకుండా బాబీ చెప్పిన కథ కూడా ఎన్టీఆర్‌కి బాగా నచ్చిందట. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎంతో ఆలోచించి మరీ కథ ఎంచుకోవాలని డిసైడ్ అవడం వల్లే... తన తర్వాతి సినిమాకు సైన్ చేయడానికి ఎన్టీఆర్ ఇంత సమయం తీసుకుంటున్నాడట ఎన్టీఆర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.