యాప్నగరం

200 కోట్ల కలెక్షన్లతో ఎన్టీఆర్ రికార్డ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్కు 2016 బాగా కలిసి వచ్చింది. ఈ ఏడాది ఆయన నటించిన చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. అయితే టాలీవుడ్లో ఇంతవరకూ ఏ హీరోకు దక్కని రికార్డ్ ఎన్టీఆర్ సొంతం చేసుకోబోతున్నారు...

TNN 18 Oct 2016, 12:21 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 2016 బాగా కలిసి వచ్చింది. ఈ ఏడాది ఆయన నటించిన చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. అయితే టాలీవుడ్లో ఇంతవరకూ ఏ హీరోకు దక్కని రికార్డ్ ఎన్టీఆర్ సొంతం చేసుకోబోతున్నారు. 2016 ఆరంభంలో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మొత్తంగా రూ. 90 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. అలాగే రీసెంట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన 'జనతా గ్యారేజ్' సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 30 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని ఈ సినిమా యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ రెండు సినిమాలు కలిసి రూ.200 కోట్లు క్లబ్లో ఎన్టీఆర్ను చేర్చాయి.
Samayam Telugu jr ntr movies bagged 200 crores collections for his movies this year
200 కోట్ల కలెక్షన్లతో ఎన్టీఆర్ రికార్డ్

ఇదిలా ఉండగా జనతా గ్యారేజ్ సినిమా అక్టోబర్ 23 నుంచి టీవీల్లో ప్రసారం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.