యాప్నగరం

ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ రూమరట!

అన్న కల్యాణ్ రామ్ నిర్మాతగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఎన్టీఆర్ ఓ కొత్త సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.

TNN 26 Dec 2016, 11:45 am
అన్న కల్యాణ్ రామ్ నిర్మాతగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఎన్టీఆర్ ఓ కొత్త సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ బాబీ (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో నటిస్తున్నారని, ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆడిపాడనున్నారని రెండు రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Samayam Telugu jr ntr new movie circulated title is not true says ntr arts
ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ రూమరట!


అంతేకాకుండా సినిమా టైటిల్‌గా ‘నట విశ్వరూప’ను పరిశీలిస్తున్నట్లు, చిత్ర యూనిట్ కూడా ఈ టైటిల్‌నే ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు పల్టీలు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లన్నీ నిజం కాదని, సినిమాకి సంబంధించి తారాగణం, టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేసింది. టైటిల్‌ను ఖరారు చేస్తే తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పింది.
Lots of rumours circulating about the title as well as cast and crew of #NTR27. None of them are true.If it's official,it'll come from us. — NTR Arts (@NTRArtsOfficial) December 26, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.