యాప్నగరం

సింగం4లో యంగ్‌టైగర్?

ప్రస్తుతం నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎప్పుడొస్తుందా? అసలు ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే విషయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా చాలా వార్తలు వినిపిస్తున్నాయి.

TNN 15 Nov 2016, 2:24 pm
ప్రస్తుతం నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎప్పుడొస్తుందా? అసలు ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే విషయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడని అంతలోనే కాదు కాదు.. అనిల్ రావిపూడి కథకే తారక్ ఓకే చెప్పాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.
Samayam Telugu jr ntr planning a movie with singam director
సింగం4లో యంగ్‌టైగర్?


అసలు ఎన్టీఆర్ రెండు నెలలు నుండి కథలు వింటున్నది తన తదుపరి సినిమా కోసం మాత్రమే కాదని వరుసగా నాలుగు ప్రాజెక్ట్స్‌ను ఫైనల్ చేసి అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని మరొక వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేయబోయే లిస్ట్ లో మరొకరి పేరు యాడ్ అయింది. అతనే తమిళ దర్శకుడు హరి. సింగం సిరీస్‌తో వరుస హిట్‌లను కొడుతున్న ఈ మాస్ డైరెక్టర్‌ తాజాగా ఎన్టీఆర్ లిస్ట్‌లో చేరాడు.

టీవల విడుదలయిన సింగం3 సినిమా టీజర్ చూసిన ఎన్టీఆర్‌కు హరి పనితనం నచ్చడంతో తనకోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ స్టోరీను వినిపించమని అడిగారట. హరి చెప్పిన కథ నచ్చడంతో వీరి కాంబినేషన్‌లో మాస్ మసాలా చిత్రం రూపుదిద్దుకుంటుందనేది లేటెస్ట్ న్యూస్. అదే సింగం4 సినిమాగా రావొచ్చనే వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్ సినిమా ఎప్పడొస్తుందా అనే దానికంటే ఏ దర్శకుడితో సినిమా మొదలు పెడతాడా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.