యాప్నగరం

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్: ‘కుశ’ ఫస్ట్‌ లుక్ కిర్రాక్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ ‘జైలవకుశ’ మూవీ నుండి గురువారం ‘లవకుమార్’ టీజర్‌ విడుదల చేసి అభిమానులకు పండుగ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. తాజాగా ‘కుశ’ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

TNN 25 Aug 2017, 11:13 am
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ ‘జైలవకుశ’ మూవీ నుండి గురువారం ‘లవకుమార్’ టీజర్‌ విడుదల చేసి అభిమానులకు పండుగ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. తాజాగా ‘కుశ’ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ‘జై లవకుశ’ మూవీలో ఎన్టీఆర్ ‘జై, లవకుమార్, కుశ’లుగా త్రిపాత్రాభినయం చేస్తుండగా ఇప్పటికే ‘జై, లవ, ఫస్ట్‌లుక్ టీజర్‌లు రిలీజ్ చేయగా వినాయక చవితినాడు ‘కుశ’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు ఎన్టీఆర్.
Samayam Telugu jr ntr starrer kusa first look released
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్: ‘కుశ’ ఫస్ట్‌ లుక్ కిర్రాక్!


‘జై’ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తూ మాస్ లుక్‌లో అదరగొట్టేసిన ఎన్టీఆర్, లవ కుమార్‌గా సాఫ్ట్ లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా ‘కుశ’లుక్‌లో పొడవాటి చుట్టుతో రాక్ స్టార్‌గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ ‘కుశ’ లుక్‌ గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘యమదొంగ’ మూవీలో నాచోరే.. నాచోరే సాంగ్ గెటప్‌ను పోలిఉంది.

రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌లు ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు రోనిత్ రాయ్ ఈ మూవీలో విలన్‌ నటిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ‘జై లవకుశ’ విడుదల కానుంది.

#KusaFirstLook pic.twitter.com/pYuLvyIooW — Jr NTR (@tarak9999) August 25, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.