యాప్నగరం

అల్లరి నరేష్ సినిమా డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ సినిమా!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవలే ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న...

TNN 4 Nov 2017, 3:21 pm
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవలే ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ ఇంకా మొదలుకాకముందే ఎన్టీఆర్ మరో సినిమాకు సైన్ చేయడానికి రెడీ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. రచయితగా కెరీర్ ప్రారంభించి దొంగల బండి సినిమాతో దర్శకుడిగా మారి, ఆ తర్వాత శతమానం భవతి చిత్రంతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న ఇటీవల ఎన్టీఆర్‌కి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. సతీష్ వేగేశ్న వినిపించిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే ఎన్టీఆర్ కూడా అతడికి యస్ చెప్పాడని తెలుస్తోంది.
Samayam Telugu jr ntr to sign an other film soon
అల్లరి నరేష్ సినిమా డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ సినిమా!


ప్రస్తుతం సతీష్ వేగేశ్న ఆ స్టోరీని పూర్తిచేసే పనిలో పడ్డాడట. త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా చేసే అవకాశం వుందంటున్నాయి సినీవర్గాలు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే కానీ మరిన్ని పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.