యాప్నగరం

బాలీవుడ్ ఫ్రెండ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్టీఆర్

తన గత చిత్రాల్లో తనతో కలిసి నటించిన ఓ బాలీవుడ్ ఫ్రెండ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఎన్టీఆర్...

Samayam Telugu 29 Jan 2017, 3:39 pm
శక్తి, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్‌వాల్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం కమాండో-2. ఈ సినిమాతో హీరోగా మారుతున్న విద్యుత్ జామ్‌వాల్‌కి తారక్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.
Samayam Telugu jr ntr wishes his bollywood friend vidyut jammwal
బాలీవుడ్ ఫ్రెండ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్టీఆర్

Wishing my dear friend @VidyutJammwal the very best for his #Commando2 in Telugu https://t.co/oNIEANH9gb— tarakaram n (@tarak9999) January 28, 2017
హిందీ, తెలుగు, తమిళ భాషల చిత్రాల్లో విలన్‌గా నటించిన విద్యుత్ జామ్‌వాల్ ఈ మూడు భాషల ఆడియెన్స్‌కి సుపరిచితుడే కావడంతో కమాండో-2 మూవీని మార్చి 3వ తేదీన ఈ మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న రిలీజైన తెలుగు ట్రైలర్‌ని ఎటాచ్ చేస్తూ తారక్ చేసిన ట్వీట్‌కి ఎంతో ఖుషీ అయిన విద్యుత్ జామ్‌వాల్... తారక్ సూపర్ స్టార్ అంటూ ప్రశంసించాడు. దెవెన్ బోజ్నాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విద్యుత్ జామ్ వాల్ సరసన అదా శర్మ, ఇషా గుప్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.